Bengaluru: బెంగళూర్ నగరంలో ఇటీవల ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పాటు ఆ రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి.
Karnataka: కర్ణాటక హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన రితేష్ కుమార్గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Waqf Act: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపే క్రమంలో, నిరసనల్లో హింసను ప్రేరేపించడానికి ప్రయత్నించాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌర్పొరేటర్. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ హింసను ప్రేరేపిస్తూ చేసిన వీడియో వైరల్గా మారింది. చట్టానికి వ్యతిరేకం యువత వీధుల్లోకి రావాలని, ప్రజా ఆస్తులు ధ్వంసం చేయాలని, ప్రాణాలు త్యాగం చేయాలని అతను వీడియోలో పేర్కొన్నాడు.
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కర్ణాటకలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
Bengaluru: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నీటి ధరలు పెరగనున్నాయి. తాగు నీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచినట్లు బెంగళూరు నీటి సరఫరా బోర్డు పేర్కొనింది.
Karnataka: కర్ణాటక దావణగెరె జిల్లాలో దారుణం జరిగింది. సొంత కమ్యూనిటీకి చెందిన సభ్యులే దొంగతం ఆరోపణలో ఓ బాలుడిని చిత్రహింసలు పెట్టారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. బాధితుడిని చన్నగిరి తాలూకా నల్లూర్ సమీపంలోని అస్తపనహళ్లీ గ్రామానికి చెందిన హక్కీ-పిక్కీ గిరిజన వర్గానికి చెందిన బాలుడిగా గుర్తించారు.
Karnataka Minister: కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన బెంగళూరు లాంటి పెద్ద నగరంలో వీధిలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు గురి కావడం తరచుగా జరుగుతాయని పేర్కొన్నారు.
Prajwal Revanna: గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో జేడీయూ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రేవణ్ణ ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్డీ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది.
ఈ మధ్య ప్రియుడి మోజులో పడి భార్యలు... నిర్దాక్షిణ్యంగా కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్న ఘటనలు ఎక్కువగా వారల్లో చూస్తున్నాం.. వింటున్నాం. కానీ ఈ ఇల్లాలు మాత్రం భిన్నంగా ప్లాన్ చేసింది. చాలా పక్కా ప్రణాళికతో స్కెచ్ గీసింది. అనుకున్నట్టుగానే భర్త కటకటాల పాలయ్యాడు.
సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు చిన్న చిన్న కారణాలకే దెబ్బతింటున్నాయి. కారణాలు ఏమైనా సరే కల కాలం కలిసి జీవించాల్సిన వాళ్లు అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు.