Karnataka: కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో చిన్న వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. క్రికెట్ బాల్ కోసం ఓ వ్యక్తి టీచర్‌ని విచక్షణారితంగా కత్తితో పోడిచాడు. టీచర్ ఇంట్లో బాల్ పడటంతో అది తీసుకుని రావడానికి వెళ్లిన సమయంలో టీచర్, యువకుడికి మధ్య జరిగిన వాగ్వాదం ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.
మంగళవారం క్రికెట్ ఆడుతుండగా, ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనచేస్తున్న 36 ఏళ్ల రామప్ప పూజారి ఇంట్లో పడింది. బాల్‌ని తీసుకురావడానికి 21 ఏళ్ల పవన్ జాదవ్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. అయితే, బాల్ టు రాలేదని రామప్ప అతడికి చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొంత సమయం తర్వాత రామప్పని పవన్ జాదవ్ కొట్టడం ప్రారంభించాడు. విరిగిన బాటిల్, కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి ముఖం, తలపై గాయాలయ్యాయి. ప్రస్తుతం, అతను ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.