Kumki Elephants: అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న పంట పొలాలను ధ్వంసం చేస్తూ.. ఊళ్లపై దాడులు చేస్తే.. ఎంతో మంది రైతులు, స్థానికుల ప్రాణాలు తీశాయి ఏనుగుల గుంపులు.. వీటితో అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న రైతులకు కంటిమీద కునుకే కరువైంది.. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కుంకీ ఏనుగులను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు.. దానికోసం బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు.. ఆ తర్వాత కర్ణాటక మంత్రి అమరావతి రావడంతో ఆంధ్రప్రదేశ్-కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అప్పగింతపై ఒప్పందం కుదురింది.. దానిలో భాగంగా ఈరోజు ఏపీకి కర్ణాటక ప్రభుత్వం ఆ కుంకీ ఏనుగులను అందించనుంది..
Read Also: KTR: కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఐదు కుంకీ ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం.. ఈ లోపే వాటి పేర్లను విడుదల చేశారు.. మొత్తం ఐదు కుంకీ ఏనుగులు ఏపీకి రానుండగా.. 1. రంజని, 2. దేవా, 3. కృష్ణా, 4. అభిమన్యు, 5. మహేంద్రగా ప్రకటించారు.. ఈ కుంకీ ఏనుగులకు సంబంధించిన ఏనుగుల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.. కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. కింద కుంకీ ఏనుగులకు సంబంధించిన నేమ్ బోర్డులు చూడొచ్చు..