Prajwal Revanna: గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో జేడీయూ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రేవణ్ణ ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్డీ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది.
ఈ మధ్య ప్రియుడి మోజులో పడి భార్యలు... నిర్దాక్షిణ్యంగా కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్న ఘటనలు ఎక్కువగా వారల్లో చూస్తున్నాం.. వింటున్నాం. కానీ ఈ ఇల్లాలు మాత్రం భిన్నంగా ప్లాన్ చేసింది. చాలా పక్కా ప్రణాళికతో స్కెచ్ గీసింది. అనుకున్నట్టుగానే భర్త కటకటాల పాలయ్యాడు.
సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు చిన్న చిన్న కారణాలకే దెబ్బతింటున్నాయి. కారణాలు ఏమైనా సరే కల కాలం కలిసి జీవించాల్సిన వాళ్లు అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు.
ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఈ కేసులో సిద్ధరామయ్య నిర్దోషి అంటూ లోకాయుక్త ఇచ్చిన నివేదికను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోసిపుచ్చింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు నివేదికను ఈడీ సవాల్ చేసింది. లోకాయుక్త నివేదికను కొట్టివేయాలంటూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Ice Cream: కర్ణాటక అధికారులు ఆహారం కల్తీపై యుద్ధమే చేస్తున్నారు. తాజాగా, కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(ఎఫ్డీఏ), ఐస్ క్రీమ్ తయారుదారుల్ని హెచ్చరించింది. ఐస్ క్రీమ్ తయారీలో క్రీమీ షేప్ రావడానికి డిటర్జెంట్ పౌడర్ ఉపయోగిస్తు్న్నట్లు అనుమానిస్తోంది. ఇదే కాకుండా ఎముకలను బలహీనపరిచే ఫాస్పోరిక్ ఆమ్లాన్ని వాడుతున్నట్లు కొనుగొంది. దీనిని కూల్ డ్రింక్స్లో పొంగే గుణం కోసం వాడుతారు.
Karnataka Bank heist: కర్ణాటక పోలీసులు దావణగెరె ఎస్బీఐ దోపిడీని ఛేదించారు. హై ప్రొఫైల్ న్యామతి ఎస్బీఐ బ్యాంక్ దొంగతనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు రూ. 13 కోట్ల విలువైన 17.7 కిలోల బంగారాన్ని దోపిడీ చేశారు. కర్ణాటక పోలీసులు 5 నెలలు కష్టపడి దర్యాప్తు చేసి, ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక ప్రజలు ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో చాలా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి లీటరుకు రూ. 4 పెంచుతున్నట్లు మంత్రి కె.ఎన్. రాజన్న గురువారం ప్రకటించారు.
BJP: బీజేపీని గత కొద్ది కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న కర్ణాటకకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యాత్నాల్ని బీజేపీ బహిష్కరించింది. పార్టీని, పార్టీ సీనియర్ నేత బీఎన్ యడియూరప్పకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన కారణంగా 6 సంవత్సరాలు బహిష్కరించింది.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు (సవరణ) బిల్లు 2025 ఆమోదించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెరుగుతున్న ఖర్చులు,…