రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పేరును ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించాలని.. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సూచించారు.…
India Justice Report : ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం, దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల పనితీరు ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించింది. 32 సూచికల ఆధారంగా ఈ మదింపు జరిగింది, ఇందులో రాష్ట్రాలను రెండు వర్గాలుగా విభజించారు: 10 మిలియన్లకు పైగా జనాభా కలిగిన 18 పెద్ద రాష్ట్రాలు మరియు 10 మిలియన్ల లోపు జనాభా కలిగిన 7 చిన్న రాష్ట్రాలు. తెలంగాణ, పెద్ద రాష్ట్రాల విభాగంలో 6.48 పాయింట్లతో మొదటి స్థానంలో…
Waqf Act: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. ఆందోళనల్లో పాల్గొన్న 150కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Bengaluru: బెంగళూర్ నగరంలో ఇటీవల ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఆ రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి.
Karnataka: కర్ణాటక హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన రితేష్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Waqf Act: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపే క్రమంలో, నిరసనల్లో హింసను ప్రేరేపించడానికి ప్రయత్నించాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌర్పొరేటర్. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత కబీర్ ఖాన్ హింసను ప్రేరేపిస్తూ చేసిన వీడియో వైరల్‌గా మారింది. చట్టానికి వ్యతిరేకం యువత వీధుల్లోకి రావాలని, ప్రజా ఆస్తులు ధ్వంసం చేయాలని, ప్రాణాలు త్యాగం చేయాలని అతను వీడియోలో పేర్కొన్నాడు.
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కర్ణాటకలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
Bengaluru: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నీటి ధరలు పెరగనున్నాయి. తాగు నీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచినట్లు బెంగళూరు నీటి సరఫరా బోర్డు పేర్కొనింది.
Karnataka: కర్ణాటక దావణగెరె జిల్లాలో దారుణం జరిగింది. సొంత కమ్యూనిటీకి చెందిన సభ్యులే దొంగతం ఆరోపణలో ఓ బాలుడిని చిత్రహింసలు పెట్టారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. బాధితుడిని చన్నగిరి తాలూకా నల్లూర్ సమీపంలోని అస్తపనహళ్లీ గ్రామానికి చెందిన హక్కీ-పిక్కీ గిరిజన వర్గానికి చెందిన బాలుడిగా గుర్తించారు.
Karnataka Minister: కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన బెంగళూరు లాంటి పెద్ద నగరంలో వీధిలో ఒక మహిళపై లైంగిక వేధింపులకు గురి కావడం తరచుగా జరుగుతాయని పేర్కొన్నారు.