పాములు పగబట్టడం విన్నాం. కాకులు పగబట్టడం ఎక్కడైనా విన్నామా? అయితే కాకులు కూడా పగబడతాయని కర్ణాటక ప్రజలు వాపోతున్నారు. కాకులు ఎవరిమీద అయినా పగబడితే అవి ఎక్కడున్నా ప్రతీకారం తీర్చుకుంటాయని వివరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామంలో ఓ కాకి పగబట్టి కొందరిపై దాడి చేస్తోంది. దీంతో సదరు కాకికి భయపడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Read Also: అక్కడ పందుల పంచాయతీ.. అసలేం…
కర్ణాకట మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనవరాలు సౌందర్య నీరజ్ (30) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు వసంతనగర్‌లోని అపార్టుమెంట్లో నివసిస్తున్న సౌందర్య.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. మాజీ సీఎం యడ్యూరప్ప పెద్ద కుమార్తె పద్మజ కూతురు సౌందర్య ఎం.ఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. Read Also: ఏడీఆర్ రిపోర్ట్: ఆస్తుల్లో టీఆర్ఎస్.. అప్పుల్లో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులున్నాయి.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే కాదు.. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. కాంగ్రెస్‌ను వీడారు.. ఇక, కాంగ్రెస్ పార్టీతో తన సంబంధాలు ముగిశాయని ప్రకటించారు.. అయితే, ఏ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.. ప్రస్తుతం తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని..…
వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుంటే ప్రభుత్వాలు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయితే, జరిమానాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది హాఫ్ హెల్మెట్‌ను ధరిస్తున్నారు. ఇలా హాఫ్ హెల్మెట్‌ను ధరించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రమాదాలు జరిగిన సమయంలో హాఫ్ హెల్మెట్ కారణంగా ముఖానికి దెబ్బతగిలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హెల్మెట్‌పై బెంగళూరు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు నగరంలో 15 రోజులపాటు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం…
కార్ల షోరూంకి వెళ్లే వినియోగదారుల పట్ల కొంతమంది సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తూ వుంటారు. పంచె కట్టుకుని కారుకొనేందుకు వెళ్ళిన రైతుని అవమానపరిచాడో సేల్స్ మ్యాన్. అయితే, రైతు ఆ సేల్స్ మ్యాన్ కి ధీటైన జవాబిచ్చాడు. అచ్చం స్నేహం కోసం సినిమా తరహాలోనే ఒక సీన్ కర్నాటకలోని ఓ మహీంద్రా షోరూమ్‌లో జరిగింది. మహీంద్రా బొలెరో కొనేందుకు ఓ రైతు షోరూమ్‌కు వెళ్ళాడు. రైతు, అతని పాటు వెళ్లిన స్నేహితుల్ని చూసి బొలెరో రూ10 కి రాదని…
కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కేసు బయటపడింది. మంకీ ఫీవర్ అంటే కోతుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. ఇది వైరల్ జబ్బు. ఇది సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణం సంభవించే అవకాశాలున్నాయి. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. Read…
మరోసారి థర్డ్‌వేవ్ రూపంలో విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారి కట్టడికి అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో కాస్త పరవాలేదు అనిపించినా.. లేదా ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినా.. సడలింపులు పెంచుతూ వస్తున్నాయి ప్రభుత్వాలు.. తాజాగా, కరోనా కట్టడి కోసం విధించిన వీకెండ్ లాక్‌డౌన్‌ను కర్ణాటక ప్రభుత్వం ఎత్తివేసింది.. రాష్ట్రంలోని ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సీఎం బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీలో హోం శాఖ, ఆరోగ్యశాఖ, విద్యా శాఖ, జలవనరుల…
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామదుర్గ తాలూకా సాలహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వికటించడంతో ఆదివారం నాడు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులకు తట్టు వ్యాధి నివారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రుబెల్లా టీకాలు వేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ టీకాలను వేయించారు. Read Also: పండగ పూట విషాదం… కల్తీ కల్లు తాగి 11 మంది మృతి అయితే రుబెల్లా టీకాలు వేసిన కాసేపటికే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర…
సమాజంలో జరిగే తప్పులను సరిదిద్దడానికే పోలీసులు ఉన్నారు. చట్టాన్ని ఎవరు పడితే వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోకూడదు. తాజాగా కర్ణాటకలో పలువురు గ్రామస్థులు దారుణానికి ఒడిగట్టారు. ఒక ఆకతాయి కుర్రాడు చేసిన అల్లరి పనికి కఠిన శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మేఘరాజ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. నిత్యం అతడు సాయంత్రం అవ్వగానే మహారాజా పార్క్‌కు వెళ్తూ ఉంటాడు. ఇటీవల కూడా పార్క్ కి వెళ్లిన అతనికి అక్కడ ఒక బాలిక కనిపించడంతో…
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేసులు ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. తాజాగా ఢిల్లీలో 28,867 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 31 మంది మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి 22,121 మంది కోలుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 94,160 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో…