కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలా వద్దా అనేది పోలీసులు నిర్ణయిస్తారని సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిర్ణయం తీసుకునేదాకా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అంటూ బొమ్మై అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన ఆరోపణలను సవాల్ గా తీసుకుని ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు…
కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో అల్లరి మూకలు ఏకంగా పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ సమయంలో ఇన్స్పెక్టర్ సహా పోలీసులు అక్కడే ఉన్నారు. వారు ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా…
ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య వ్యవహారం ఆ మంత్రి మెడకు చుట్టుకుంది… ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్.. సూసైడ్ నోట్లో ఏకంగా మంత్రి పేరు పేర్కొన్నాడు.. తనకు రావాల్సిన బిల్లులో 40 శాతం కమిషన్ అడిగారనే ఆరోపణలు మంత్రిపై వచ్చాయి.. విపక్షాలు ఆందోళనకు దిగాయి.. దీంతో.. ఎకట్టేలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప… ఎట్టకేలకు రాజీనామా ప్రకటన చేశారు. ఇవాళ రాజీనామా లేఖను సీఎం బసవరాజ్ బొమ్మైకి అంద చేస్తానని గురువారం…
కర్నాటకలో ఎప్పుడూ హాట్ హాట్ రాజకీయాలు నడుస్తుంటాయి. తాజాగా మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాకిచ్చింది. అత్యంత వివాదాస్పదుడిగా, అవినీతిపరుడిగానూ పేరుపొందిన బీజేపీ మంత్రి ఈశ్వరప్పపై బీజేపీ వేటేసింది. మంత్రిగా ఉండి మతఘర్షణలకు ఊతమిస్తున్నారనే విమర్శలకు తోడు సామాన్యులను బెదిరించి, వారి మరణాలకూ కారకుడవుతున్నారని ఈశ్వరప్పపై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా సంతోష్ పాటిల్ అనే గవర్నమెంట్ రోడ్డు కాంట్రాక్టర్ ఆత్మహత్య ఉదంతం దేశాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ వివాదంపై సీఎం స్పందించారు. దీనిపై వస్తున్న…
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ తరహా ఘటనలు అడుగడుగునా జరుగుతున్నాయి. కర్ణాటకలో ఓ బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. బాలికపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో కిమ్మనకుండా ఉండిపోయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ ఏడుస్తూ వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఆరాతీశారు. కబాబ్ తిన్నానని, అందులో కారంగా వుండడంతో ఏడిచానని…
సంతకం పెట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే అందరూ సాధారణంగా వారి పూర్తి పేరును సంతకంగా పెట్టలేరు. అందుకే సంతకం చేసే సమయంలో తమ పేరును కుదిస్తారు. అయితే సంతకం అనేది సులువుగా ఉంటే సులువుగా కాపీ చేసే ప్రమాదం ఉంది. దీంతో సంతకం అర్థం కాకుండా పెట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో కర్ణాటకలో పనిచేసే సబ్‌రిజిస్టర్ శాంతయ్య ప్రత్యేకంగా నిలిచారు. దీంతో ఆయన సంతకాన్ని ఏకంగా యునెస్కో అద్భుతమైన…
ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కర్ణాటకలో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిక్ బళ్ల పూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేదికపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. అందరి కన్నా మూడ్‌ను ఎవరి గురించి మాట్లాడాలో ఆయనే మా బిగ్ బ్రదర్ పునీత్ రాజ్ కుమార్… ఆయన మా కుటుంబ సభ్యులు…
దర్శక ధీరుడు రాజమౌళి కోపం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చాలామంది హీరోలు సెట్ లో జక్కన్న అరుస్తాడని బాహాటంగానే చెప్పారు. ఇక నేడు కర్ణాటకలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదటిసారి జక్కన్న కోప్పడడం హాట్ టాపిక్ గా మారింది. స్టేజిపైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతుండగా.. స్టేజి మీద ఉన్న బాడీగార్డ్స్ , డాన్సర్స్, పోలీసులు అందరు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో అక్కడ కొద్దిగా గందరగోళం ఏర్పడింది. ఇక ఇది…
కర్ణాటక మొత్తం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హంగామా కొనసాగుతోంది. చిక్ బళ్ల పూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరుగుతున్నా ఈ వేడుకలో నిర్మాత డివివి దానయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” ఈ చిత్రానికి నిర్మాతగా మారడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను కలిపే అదృష్టం రాజమౌళి నాకు ఇచ్చారు. అందుకు ఆయనకెప్పుడు ఋణపడి ఉంటాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి…
ఆర్ఆర్ఆర్ వేడుక మొదలైపోయింది. కర్ణాటకలోని చిక్ బళ్ల పూర్ లో గ్రాండ్ గాప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే.అతిరధమహారథులు హాజరవుతున్న ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ త్రయం హైలైట్ గా నిలిచారు. ఇక ఈ వేడుకను కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని తలుచుకొని మొదలుపెట్టడం విశేషం. కన్నడ పవర్ స్టార్ ని అభిమానులు ఎప్పటికి గుర్తుంచుకుంటారని, ఆయన ఎప్పుడు అభిమానుల మనసులో నిలిచి ఉంటారని యాంకర్ చెప్తూ వేడుకను మొదలుపెట్టారు.. ఇక ఆ…