జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అన్న సామెతను మనం వింటుంటాం కదా.. ఇప్పుడు ఈ..పెట్రోల్ బంకులో అదే జరుగుతోంది.. కస్టమర్లు లేక వీళ్లు ఇదే పని చేస్తున్నారు.. ఒకళ్లిద్దరు వస్తే అదే మహా భాగ్యమని, దేవుళ్లు వచ్చారని ఫీలవుతున్నారు ఈపెట్రోల్ బంకు నిర్వాహకులు.. పెట్రోల్ ధరల దెబ్బకు ఇక్కడ సీన్ రివర్స్ అయింది.. ఈ ఒక్క బంకే కాదు.. కర్నాటక సరిహద్దు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, నియోజకవర్గాల్లోని మెజారిటీ బంకుల పరిస్థితి ఇదే..
తెలంగాణలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండటం.. కర్నాటకలో తక్కువగా పెట్రోల్ దొరుకుతుండటంతో వాహనదారులంతా కర్నాటక పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు.. ఫలితంగా ఇక్కడి బంకులకు జనం రాక నిల్వలు పేరుకుపోయాయి.. సొంతూరి పక్కన పెట్రోల్ బంకు ఉన్నా దాన్ని కాదని కర్నాటకు వెళ్తున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే కర్నాటకలో పెట్రోల్, డీజిల్‌పై పది రూపాయల వరకు తక్కువకు దొరుకుతోంది.. తెలంగాణలో లీటరు పెట్రోల్ 120 రూపాయల 85 పైసలు ఉంటే.. కర్నాటకలో 110 రూపాయల 85పైసలుకే లభిస్తోంది.. తెలంగాణలో లీటరు డీజిల్ 106 రూపాయలు 76 పైసలకు లభిస్తుండగా.. కర్నాకటలో 96 రూపాయలకే దొరుకుతోంది. దీంతో జనం కర్నాటక బంకులవైపు క్యూ కడుతున్నారు. కర్నాటక సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఎక్కువగా తెలంగాణ ప్రాంత ప్రజల వాహనాలే కనిపిస్తున్నాయి.
Gas Cylinder: మోడీ వచ్చాక పెరిగిన ధర ఎంతో తెలుసా?