Karnataka: హుబ్లీలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌పై అల్లరి మూకల దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో అల్లరి మూకలు ఏకంగా పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ సమయంలో ఇన్‌స్పెక్టర్ సహా పోలీసులు అక్కడే ఉన్నారు. వారు ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉంచిన వాహనాలను సైతం దుండగులు ధ్వంసం చేశారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే హుబ్లీ పోలీస్ కమిషనర్ లభు రామ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుబ్లీ నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ను విధించారు. కాగా హుబ్లీ ఓల్డ్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న హనుమాన్ ఆలయంపైనా రాళ్లదాడి సంభవించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. అటు ఢిల్లీలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా కొందరు రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Karnataka | A stone-pelting incident took place at Old Hubli Police Station, Hubli
Four policemen including one inspector injured. Section 144 imposed in the entire city. Investigation is underway & a case has been registered: Police Commissioner Labhu Ram pic.twitter.com/WbaGSUKdob
— ANI (@ANI) April 16, 2022
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..