ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 9 నెలలే గడిచింది.. ఇప్పుడు ఆయన్ని మార్చేపనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. దీనికి కారణం లేకపోలేదు.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. కింది నుంచి పై స్థాయి వరకు తాము మార్పులు చేయాలనుకుంటే చేసేస్తామని, అందులో ఏమాత్రం సంకోచించడం లేదన్నారు.. గుజరాత్, ఢిల్లీ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆయన కామెంట్లపై ఇప్పుడు కర్ణాటకలో తీవ్రమైన చర్చసాగుతోంది.. త్వరలోనే సీఎం బొమ్మై స్థానంలో.. కొత్త వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.
Read Also: Unemployment: మరింతపైకి నిరుద్యోగిత రేటు..
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అతిత్వరలోనే మార్చేస్తారనే చర్చ మాత్రం హీట్ పెంచుతోంది.. ఈరోజు బెంగళూరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. కాగా, అన్ని చోట్లా మార్పులు ఉంటాయని నేను చెప్పడం లేదు.. కానీ, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఊహించని నిర్ణయాలు బీజేపీ తీసుకోగలుగుతుంది. పార్టీపై ఉన్న విశ్వాసం మరియు సంకల్పం కారణంగా, ఈ నిర్ణయాలు సాధ్యమయ్యాయని, గుజరాత్‌లో, ముఖ్యమంత్రిని మార్చారు, మొత్తం కేబినెట్‌ను కూడా మార్చారు. ఇది తాజాదనాన్ని నింపాలనే ఉద్దేశ్యంతో జరిగింది.. వారిపై ఫిర్యాదులు ఉన్నాయని కాదన్నారు సంతోష్. రాజకీయాల్లో కూడా మార్పు వస్తుందన్న ఆయన.. రెండోసారి అధికారంలోకి రావడం అంత తేలికైన పని కాదు. రెండోసారి ఎన్నికల్లో గెలుపొందడం సవాల్ అన్నారు. బీఎస్ యెడియూరప్ప స్థానంలో మిస్టర్ బొమ్మై వచ్చిన ఒక సంవత్సరంలోపే కర్ణాటక మరోసారి మార్పు తప్పదనే చర్చకు మాత్రం దారితీసింది. అయితే, ఈ పరిస్థితులపై సీఎం బొమ్మై స్పందించలేదు.. కానీ, ఇదే సమయంలో రెండు వారాల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.