కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మత మార్పిడి నిరోధక బిల్లుపై ఈ రోజు సీఎం బస్వరాజ్ బొమ్మై కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, మండలి ప్రొరోగ్ కావడంతో బొమ్మై సర్కార్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లును 2021 డిసెంబర్ లో కర్ణాటక శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో…
సీడబ్ల్యూసీకి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది.. కేంద్ర జలసంఘంలోని ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కర్ణాటక చేపట్టిన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.. అంతర్ రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వరాదని సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ.. రెండు ప్రాజెక్టులకు అనుమతులతో కృష్ణాకు తుంగభద్ర నుంచి ప్రవాహాలు…
దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. మసీదుల్లో, ఇతర ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజాగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6…
ఈయన పేరు శివరాజ్ పాటిల్. కర్నాటకలోని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే. ఇక ఈయన.. రాజేందర్రెడ్డి. తెలంగాణలోని నారాయణపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇద్దరిదీ వేర్వేరు రాష్ట్రాలైనా.. సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో నారాయణపేటలో రాజేందర్రెడ్డిని ఓడించడానికి ప్రచారం చేస్తానని పాటిల్ అంటే.. అదే విధంగా కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. దీంతో ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? ఎందుకు శపథాలు చేసుకుంటున్నారు అనేది చర్చగా మారింది. తెలంగాణలో…
జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అన్న సామెతను మనం వింటుంటాం కదా.. ఇప్పుడు ఈ..పెట్రోల్ బంకులో అదే జరుగుతోంది.. కస్టమర్లు లేక వీళ్లు ఇదే పని చేస్తున్నారు.. ఒకళ్లిద్దరు వస్తే అదే మహా భాగ్యమని, దేవుళ్లు వచ్చారని ఫీలవుతున్నారు ఈపెట్రోల్ బంకు నిర్వాహకులు.. పెట్రోల్ ధరల దెబ్బకు ఇక్కడ సీన్ రివర్స్ అయింది.. ఈ ఒక్క బంకే కాదు.. కర్నాటక సరిహద్దు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, నియోజకవర్గాల్లోని మెజారిటీ బంకుల పరిస్థితి ఇదే.. తెలంగాణలో…
రూ.2,500 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇప్పిస్తామంటూ కొందరు ఆఫర్ చేశారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక సీఎం పదవి వేలానికి పెట్టారా.. డబ్బులిస్తే చాలు.. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా అంటూ ఆయన నిలదీశారు. సీఎం సీటు ఏమైనా పేమెంట్ సీటా అని ప్రశ్నించారు. బసనగౌడ వ్యాఖ్యలపై తక్షణం దర్యాప్తు జరపాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణ జరపకుంటే బసవరాజ్…
ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 9 నెలలే గడిచింది.. ఇప్పుడు ఆయన్ని మార్చేపనిలో పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.. దీనికి కారణం లేకపోలేదు.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. కింది నుంచి పై స్థాయి వరకు తాము మార్పులు చేయాలనుకుంటే చేసేస్తామని, అందులో ఏమాత్రం సంకోచించడం లేదన్నారు.. గుజరాత్, ఢిల్లీ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ఆయన కామెంట్లపై ఇప్పుడు కర్ణాటకలో తీవ్రమైన చర్చసాగుతోంది..…
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులతో చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టిందని, చివరికి…
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నిభాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్ళు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక యష్ ఫ్యాన్స్ థియేటర్లో చేసే రచ్చ మాములుగా లేదు. యష్ నటనకు, అతడు చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతూ ఈలలు, గోలలు చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా ఒక…
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కొన్నిరోజుల వరకు మ్యానియాలో ఉండిపోతారు అభిమానులు.. పుష్ప రిలీజ్ అయ్యాక తగ్గేదేలే, పార్టీలేదా పుష్ప అని మొదలుపెట్టారు.. ఆ తరువాత భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాకా మనల్ని ఎవడ్రా ఆపేది అని స్టార్ట్ చేశారు.. ఇక ఆర్ఆర్ ఆర్ డైలాగ్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఇక తాజాగా అభిమానులందరూ కెజిఎఫ్ 2 మ్యానియాలో పడ్డారు . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్ ను వాడేస్తున్నారు.…