మహిళలపై దాడులు జరగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు. మరికొంత మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలు శిక్షిస్తాయనే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడి చేశారు. బాధితురాలు, నిందితుడికి సహోద్యోగి. అతన్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అప్పటికే వివాహం అయి ఓ బిడ్డ ఉన్నా.. తనను వివాహం చేసుకోవాలని వేధిస్తుండే వాడు నిందితుడు.…
ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. అంతేకాకుండా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ విలేకరితో కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది. నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై కస్సుబుస్సుమంటూ మండిపడింది. తప్పు చేసి తప్పించుకోవడమే కాకుండా పోలీసులపై ఫైర్ అయిన ఆ యువతి ఓ ప్రజా ప్రతినిధి కుమార్తె అవ్వడం మరో విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె…
నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరగనుంది. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న…
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ 23 మంది విద్యార్థినులు నిరసన తెలిపారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారందరినీ వారంపాటు సస్పెండ్ చేసింది. విద్యార్థినులు వారం పాటు కాలేజీకి రాకుండా నిషేధం విధించింది. Corona Updates : కర్ణాటకలో మళ్లీ కరోనా కలవరం.. అయితే ఈ ఏడాది మార్చిలో హిజాబ్‌పై కర్ణాటక…
ఒక నాయకులు కోడంగల్ లో తంతే మల్కాజ్ గిరిలో వచ్చిపడ్డాడు. ఆయనది ఐరన్ లెగ్ తెలుగు దేశంను నాశనం చేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేయబోతున్నాడంటూ.. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. కోస్గిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తడో తెలియదు కానీ.. ఈరోజు మన పాలనలో దేశంలో 24గంటల కరెంట్ ఇస్తుంది మన రాష్ట్రమే అని ఆయన అన్నారు. 10 సార్లు అవకాశం ఇస్తే దేశాన్ని 50…
కర్నాటకలో మరోసారి ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. ఇటీవల కాలంలో కర్నాటకలో వరసగా మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఓ వైపు దేశంలో జ్ఞాన్వాపి మసీదు వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర షాహీ ఈద్గా మసీదు విషయం కూడా ప్రస్తుత కోర్టు లో ఉంది. ఇలాంటి వివాదాల మధ్య కర్నాటకలో ఇలాంటి వివాదాలే తెరపైకి వస్తున్నాయి. కర్నాటక మాండ్యా జిల్లా శ్రీరంగ పట్నంలోని జామియా మసీదు ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. కొన్ని…
కర్ణాటక రాష్ట్రం కలబురిగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థీవదేహాలను వారి స్వస్థలానికి తరలించడం.. క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, మంత్రి తలసాని శ్రీనివాస్…
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా కమలాపురలో కంటైనర్ ట్రక్కును ఢీ కొట్టి బస్సు బోల్తాపడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగు సజీవ దహనం మయ్యారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు ప్రయాణికులను ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు మృత్యువాత పడ్డారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో మొత్తం డ్రైవర్ తో సహా 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన అనంతరం కొందరు సురక్షితంగా బయట పడినట్లు స్థానిక పోలీసులు…
కర్ణాటకలో వివాదాలకు కొదువే లేదు. కర్ణాటకలో జరిగే ఏదో ఒక అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. అక్కడి నేతలు కూడా ఎప్పుడూ ఏదో కాాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ జెండా ఏదో ఒక రోజు జాతీయ జెండా అవుతుందనడంలో సందేహమే లేదని ఆయన అన్నార. కాషాయంపై గౌరవం అనేది ఈ రోజుది కాదని వేల ఏళ్ల…
కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా హిజాబ్ వివాదం కర్ణాటకలో నానుతూనే ఉంది. హైకోర్ట్ విద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి రావడానికి వ్యతిరేఖంగా తీర్పు చెప్పింది. అయినా కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. మండ్యా, శివమొగ, ఉడిపి, చిక్ బళ్లాపూర్, మైసూర్, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈ వివాదంతో పాఠశాలల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా హిజాబ్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం…