కర్నాటకలో ఇవాళ (మంగళవారం) ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. భయంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే.. గత మూడు రోజుల్లో ఇలా ప్రకంపనాలు రావడం ఇది మూడోసారి కావడంతో ప్రజలు భయాందోనకు గురవుతున్నారు. కాగా. సుల్లియా పరిసర ప్రాంతాల్లో రెండోసారి ప్రకంపనలు రికార్డయ్యాయి. అయితే ప్రజలు మాట్లాడుతూ.. భారీ శబ్దంతో…
ఎరువుల కొరతపై కేంద్ర మంత్రిని ప్రశ్నించాడు.. వచ్చే ఎన్నికల్లో మా ఏరియాలో ఓట్ల అడగాలని సవాల్ విసిరాడు.. చివరకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కర్ణాటక బీదర్ లోని హెడపురా గ్రామానికి చెందిన కుశాల్ పాటిల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎరువుల కొరత గురించి కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహయమంత్రి భగవంత్ ఖూబాకు ఫోన్ చేశాడు. అయితే వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషన వైరల్ గా మారింది. దీనిపై విచారించిన విద్యాశాఖ అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది.…
కర్ణాటకలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క బర్త్‌డే పార్టీని ఘనంగా నిర్వహించాడు.. 5 వేల మందిని పిలిచి ఏకంగా భోజనాలు పెట్టించాడు.. 100 కిలోల కేక్ కట్ చేశాడు..
అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(Yoga for humanity) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి సర్భానంద…
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే బాధ్యత మీదే అంటూ హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనికి నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగితే కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్…
చెట్లు మనకు ప్రాణవాయువుని అందిస్తాయి, మండుటెండ నుంచి కాపాడుకోవడానికి నీడనిస్తాయి, చల్లటి గాలిని ఇస్తాయి, వర్షాల్నీ కురిపిస్తాయి.. ఇవన్నీ అందరికీ తెలిసిందే! కానీ, ఓ చెట్టు నుంచి వర్షపు జల్లులు కురుస్తున్నాయంటే నమ్ముతారా? మీరు నమ్మినా, నమ్మకపోయినా.. ఇది మాత్రం నిజం. కర్ణాటక కొడగు సమీపంలోని హెరవనాడు గ్రామంలో ఓ చెట్టు నుంచి నిరంతరాయంగా వర్షపు జల్లులు కురుస్తున్నాయి. చెట్టు కొమ్మల నుంచి 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీరు పడుతోంది. కొన్ని వారాలు నుంచి ఆ…
ఈమధ్య కొందరు చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారినే కడతేరుస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు చికెన్ కూర వండలేదని, తన భార్యని అత్యంత కిరాతకంగా చంపాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కెంచప్ప, షీలా అనే జంట 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. బన్నికోడు గ్రామంలో నివసిస్తున్న ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య తరచూ గొడవలు…
మహిళలపై దాడులు జరగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు. మరికొంత మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలు శిక్షిస్తాయనే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడి చేశారు. బాధితురాలు, నిందితుడికి సహోద్యోగి. అతన్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అప్పటికే వివాహం అయి ఓ బిడ్డ ఉన్నా.. తనను వివాహం చేసుకోవాలని వేధిస్తుండే వాడు నిందితుడు.…
ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. అంతేకాకుండా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ విలేకరితో కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది. నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై కస్సుబుస్సుమంటూ మండిపడింది. తప్పు చేసి తప్పించుకోవడమే కాకుండా పోలీసులపై ఫైర్ అయిన ఆ యువతి ఓ ప్రజా ప్రతినిధి కుమార్తె అవ్వడం మరో విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె…