Bengaluru: పెళ్లికి నిరాకరించిందని యువతిపై యాసిడ్ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలపై దాడులు జరగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు. మరికొంత మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలు శిక్షిస్తాయనే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడి చేశారు. బాధితురాలు, నిందితుడికి సహోద్యోగి. అతన్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అప్పటికే వివాహం అయి ఓ బిడ్డ ఉన్నా.. తనను వివాహం చేసుకోవాలని వేధిస్తుండే వాడు నిందితుడు.
పూర్తి వివరాల్లోకి వెళితే నిందితుడు అహ్మద్ గోరిపాళ్యకు చెందిన వాడిగా గుర్తించారు. అహ్మద్, బాధిత మహిళ ఇద్దరు అగరబత్తుల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నారు. అయితే పరిచయం పెంచుకున్న అహ్మద్ తనను పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధించేవాడు. బాధితురాలికి అప్పటికే పెళ్లై ఓ బిడ్డ కూడా ఉంది. ఈ క్రమంలోనే అహ్మద్ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో శుక్రవారం ఉదయం యాసిడ్ దాడి చేశాడు. అయితే యాసిడ్ దాడి నుంచి బాధితురాలు ప్రాణాలు దక్కించుకున్నా.. ఆమె కుడి కన్ను దెబ్బతిందని.. ఆమె చూపు 70 శాతం మాత్రమే ఉందని, కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు.
Also Read
బాధిత మహిళ కుమారస్వామి లేఅవుట్ నుంచి జేపీ నగర్ వెళుతుండగా సారక్కి జంక్షన్ సమీపంలో ఆమెపై యాసిడ్ పోసి అక్కడి నుంచి అహ్మద్ పారిపోయాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో గత రెండు నెలల్లో మూడో యాసిడ్ దాడి. ఈ ఘటనపై హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ యాసిడ్ విక్రయాలను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని, దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!