Viral: ఘనంగా శునకం బర్త్ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్ టచ్ కూడా ఉందట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెంపుడు జంతువులను ఎంతో ప్రేమ చేస్తారు.. పొరపాటును అవి తప్పిపోతే వాటి యజమానులు చేసే హడావుడి చాలా సార్లు చూశాం.. ఏకంగా మీడియాకు ఎక్కి, నా పిల్లి పోయింది, నా కుక్కపోయింది.. ఆచూకీ చెబితే తగిన బహుమతి ఇస్తాం అని ప్రకటించినవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కపై ఉన్న అభిమానాన్ని ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేశాడు.. అయితే, ఆ కథకు పొలిటికల్ టచ్ కూడా ఉండడంతో.. ఊరు ఊరంతా పిలిచాడు.. 100 కిలోల కేట్ కట్ చేశాడు.. చుక్క (లిక్కర్) లేదు కానీ.. ముక్క (మటన్)తో మంచి భోజనం వడ్డించాడు.. అతిథులు కేక్ తిని, భోజనాలు చేసి.. ఆ కుక్కుకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: COVID 19 Update: బుసలు కొడుతోన్న కరోనా.. తెలంగాణలో 500కు చేరువగా కేసులు
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
కర్ణాటకలో జరిగిన కుక్క బర్త్‌డే పార్టీ, దాని వెనుక పొలిటికల్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శివప్పబెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి… ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.. దానికి ‘క్రిష్’ అని పేరు పెట్టుకున్నాడు.. క్రిష్ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాడు.. గ్రామంలోని దాదాపు 5 వేల మందిని పిలిచి మంచి భోజనం వడ్డించాడు.. శునకం పుట్టినరోజు వేడుకల్లో వంద కిలోల కేక్ కట్ చేయడమే కాదు.. 300 కిలోల మటన్, పెద్ద సంఖ్యలో గుడ్లను తెప్పించాడు.. నాజ్ వెజ్ ప్రియులకు నాన్‌వెజ్… వెజ్ తినేవారి కోసం ప్రత్యేకంగా కూరగాయలను తెప్పించి భోజన ఏర్పాట్లు చేశారు. కేక్ కట్ చేసిన తర్వాత కుక్కను వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు.. గ్రామంలోని ప్రజలందరూ దానికి నమస్కరించారు. అయితే, క్రిష్‌పై శివప్ప మర్డికి ప్రేమ ఉన్నా.. పార్టీ వెనుక మాత్రం.. చిన్న పొలిటికల్ టచ్ ఉంది.. అదేంటి అంటే.. శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు.. ఓ సారి కొత్త పంచాయతీ సభ్యుడు తన పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడట.. ఆ సందర్భంగా పాత పంచాయతీ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. మా హయాంలో పాత పంచాయతీ సభ్యులు వచ్చి కుక్కల్లా తిన్నారని కించపర్చే వ్యాఖ్యలు చేశాడట.. ఆ మాటలతో నొచ్చుకున్న శిప్ప మర్డి.. తన పెంపుడు కుక్క పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించి.. ఐదు వేల మందిని పిలిచి భోజనాలు పెట్టి ఔరా! అనిపించారు.. మొత్తంగా ఈ న్యూస్, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!