National award winning playback singer Shivamoga Subbanna passed away: ప్రముఖ గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న(83) కన్నుమూశారు. బెంగళూర్ లోని జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్లో చికిత్స పొందుతున్న సుబ్బన్నకు గత రాత్రి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో మరణించారు. సుబ్బన్న కర్ణాటక రాష్ట్రం నుంచి మొదటిసారిగా జాతీయ అవార్డు అందుకున్న సింగర్
Communal clashes in Karnataka: కర్ణాటకలో మతాంతర ప్రేమ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ ఘటన కర్ణాటక కొప్పల్ జిల్లా హులిహైదర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హులి హైదర్ గ్రామానికి చెందిన హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుని పారిపోయారు. దీంతో వీరిద్దరిని పోలీసులు పట్టుకువచ్చి ఇరు కుటుంబాలకు అప్పగించాయి.
Triple riding ban on bike in Mangaluru: కర్ణాటకలోని మంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బైక్ పై ముగ్గురు పురుషులు ప్రయాణించడాన్ని నిషేధించారు. ఆగస్టు 8 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. అయితే 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్కు బదులుగా చికెన్పాక్స్ ఉన్నట్లు నిర్ధారించబడింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ ప్రకారం.. ఇథియోపియన్ పౌరుడు ఈ నెల ప్రారంభంలో మంకీపాక్స్ లక్షణాలతో బెంగళూరు విమానాశ్రయంలో దిగగా.. అతనిని పరీక్షల కోసం పంపించారు.
Another youth killed in karnataka: కర్ణాటక వరస హత్యలతో అట్టుడుకుతోంది. వరసగా రోజుల వ్యవధిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు యువకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది.
కర్ణాటకలో ఓ బీజేపీ కార్యకర్త హత్య విషయంపై పార్టీలోనూ, బయటా నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితులకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని.. ఒకవేళ పరిస్థితులుగానీ మారితే పరిస్థితులు డిమాండ్ చేస్తే కర్ణాటకలో కూడా ‘యోగి మోడల్’ ప్రభుత్వం అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించారు.
BJP Worker Killed in karnataka: కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ యువమోర్చా కార్యకర్త దారుణహత్యతో అట్టుడికిపోతోంది. దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు బందోబస్త్ ను పెంచారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని బెల్లారే ప్రాంతంలో బీజేపీ యువ మోర్చా ఆఫీస్ బేరర్ ప్రవీణ్ నెట్టారును దుండగులు దారుణంగా హత్య చేశారు.
Missing Pet Parrot Found in Karnataka: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో తమ పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో సదరు యజమాని దాన్ని పట్టించినందుకు రూ.50,000 రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెంపుడు చిలుక ఆచూకీ వారం రోజుల తరువాత తెలిసింది. దీంతో దీన్ని పట్టించిన వ్యక్తికి ముందుగా అనుకున్న రూ. 50,000 కన్నా ఎక్కువగా బహుమతి ఇచ్చాడు. ఏకంగా రూ.85,000 రివార్డు ఇచ్చాడు.
ఓ సీనియర్ పొలిటీషనర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు చేశారు.. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు.. ఇప్పటి వరకు తాను ప్రాతినథ్యం వహిస్తూ వచ్చిన శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తున్నాను.. ఇకపై తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి బరిలోకి దిగుతారని.. రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి…