Shocking snake Video: పాము పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. అదే పాము నిజంగా కళ్లకు కనిపిస్తే షేక్ అవ్వాల్సిందే. అయితే కర్ణాటకలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సీన్ చోటుచేసుకుంది. ఓ బాలుడు యథావిధిగా ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి దిగుతూ తెలియక పాముపై కాలేశాడు. వెంటనే తల్లి స్పందించి క్షణాల్లో అతడిని పక్కకు లాగేయడంతో ప్రాణప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని మాండ్యలో ఓ ఇంటి ముందు ఓ పెద్ద పాము చిన్నగా పాకుతూ వెళుతోంది. ఇంటికి మెట్లు ఉండటంతో మెట్టు చాటున అది పాకుతోంది. మాములుగా ఇంట్లో నుంచి చూస్తే పాము కనిపించే అవకాశం లేదు. చివరి మెట్టు కూడా దిగితేనే అది కనిపిస్తుంది.
Read Also: RRB Exams: అభ్యర్థులకు అలర్ట్.. ఆర్ఆర్‌బీ గ్రూప్-D రాతపరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ఈ విషయం తెలియకపోవడంతో ఓ బాలుడు ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లేందుకు యూనిఫారంలో సిద్ధమయ్యాడు. దీంతో తల్లి అతడిని స్కూల్‌కు సాగనంపుతోంది. ఇంతలో బాలుడు తెలియక వీధి వైపు చూస్తూ నెమ్మదిగా పాకుతున్న పాముపై కాలేశాడు. అది మాములు పాము కాదు. పెద్ద తాచు పాము. ఈ నేపథ్యంలో బాలుడు కాలు సరిగ్గా తాచుపాము మీద పడింది. వెంటనే తాచుపాము వెనక్కి వెళ్లి పైకిలేచి బాలుడిని కాటు వేయబోయింది. దీన్ని చూసిన బాలుడి తల్లి వేగంగా ముందుకు వచ్చేసి తన కుమారుడిని పక్కకు లాగేసి ఎత్తుకుంది. దీంతో తాచుపాము ముందుకు వెళ్లిపోయింది. మహిళ స్పందించడం ఒకటి రెండు సెకన్లు ఆలస్యం అయినా పాము ఆ బాలుడ్ని కాటేసేదే. తల్లి సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలోకి షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
Totally shaken by this clip. Salute to the brave and alert mother who saved her baby and the Cobra too was unharmed but its a serious reminder to be extremely alert in monsoon season. video courtesy – shared pic.twitter.com/GvLahkGI1l
— Supriya Sahu IAS (@supriyasahuias) August 13, 2022