karnataka Exit Poll: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలకంగా భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. ఈ రోజు 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ తప్పడని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కొన్ని సంస్థలు బీజేపీ మెజారిటీ వస్తుందని అంచనా వేస్తే మరికొన్ని మాత్రం కాంగ్రెస్ దే అధికారం అని చెబుతున్నాయి. అయితే మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం కూడా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే తెలుస్తోంది. మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. అధికారంలో రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు సాధించాలి.
సర్వే సంస్థ- రిపబ్లిక్ టీవీ
కాంగ్రెస్: 94-108
బీజేపీ: 85-100
జేడీఎస్: 24-32
ఇతరులు: 2-6
సర్వే సంస్థ- జన్ కీ బాత్
కాంగ్రెస్: 91-116
బీజేపీ: 94-117
జేడీఎస్: 14-12
సర్వే సంస్థ-పీపుల్స్ ఫల్స్
కాంగ్రెస్: 107-119
బీజేపీ: 78-90
జేడీఎస్: 23-29
ఇతరులు: 1-3
సర్వే సంస్థ- జీ మాట్రిస్
కాంగ్రెస్: 103-118
బీజేపీ: 79-94
జేడీఎస్: 25-33
సర్వే సంస్థ- సువర్ణ న్యూస్
కాంగ్రెస్: 91-106
బీజేపీ: 94-117
జేడీఎస్: 14-24
సర్వే సంస్థ- ఏబీపీ, సీ ఓటర్
కాంగ్రెస్: 100-112
బీజేపీ: 83-95
జేడీఎస్: 21-29
ఇతరులు: 2-6