Himanta Biswa Sarma: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ గ్యారంటీ ఇస్తున్నారు.. అయితే రాహుల్ గాంధీ గ్యారంటీ ఎవరు తీసుకుంటారు..రాహుల్ గాంధీని నిలబెట్టేందుకు సోనియాగాంధీ గత 20 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు.
Read Also: Carden search: మాదాపూర్ లో కార్డెన్ సెర్చ్.. 400 కాటన్స్ మద్యం బాటిళ్ళు సీజ్
మరోసారి టిప్పు సుల్తాన్ ను విమర్శించారు హిమంత బిశ్వ శర్మ. టిప్పు స్వాతంత్యసమరయోధుడు అయితే.. తమ సంస్కృతి, మాతృభూమి కోసం మరణించిన 80,000 కొడవలు ఎవరు అని ప్రశ్నించారు. తమ నాయకుడు భూమిని, ధర్మాన్ని కాపాడుకోవడానికి త్యాగాలు చేశారని, వారి త్యాగాలను గుర్తించే చరిత్ర అవసరం అని ఆయన అన్నారు. టిప్పు సుల్తాన్ సొంత రాజ్యాన్ని కాపాడుకోవడానికి బ్రిటీష్ వారిపై యుద్ధం చేశారని, మాతృభూమి కోసం త్యాగాలు చేసిన కొడవ ప్రజలు నిజమైన స్వాతంత్ర సమరయోధులు అని ఆయన అన్నారు.
వామపక్షాలు రాసిన చరిత్ర ఇక చాలని, మన భూమని, ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వీరులు చేసిన త్యాగాలను గుర్తించే నవభారత చరిత్ర అవసరం అని ఆయన ట్వీట్ చేశారు. శనివారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ టిప్పు కుటుంబ సభ్యులుగా వర్ణించారు. నేను అస్సాం నుంచి వచ్చాను, అస్సాంపై 17 సార్లు మొఘలులు దాడి చేశారు. కానీ వారు మమల్ని ఓడించలేదు. కొడుగు ప్రజలు కూడా టిప్పు సుల్తాన్ ను చాలా సార్లు ఓడించారని ఆయన అన్నారు. సిద్దరామయ్య టిప్పు జయంతిని జరుపుకోవాలంటే పాకిస్తాన్ వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక పీఎఫ్ఐ కి మళ్లీ కేంద్రంగా మారుతుందని అన్నారు.