Karnataka assembly elections Live Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ , కాంగ్రెస్, జేడీఎస్ పోటీ పడుతున్నాయి. 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఎన్నికల బరిలో 918 మంది స్వతంత్రులతో కలిపి 2,613 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డులోని పోలింగ్ కేంద్రాలలో ఫేస్ రికాగ్నైజేషన్ అమలు చేస్తున్నారు.
Read Also: Karnataka Election: కర్నాటకలో ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్‌లు..!
పోలింగ్ బందోబస్తు కోసం మొత్తం 84 వేల119 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక వ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 30 లక్షల 85 వేల 566 మంది ఓటర్లు ఉండగా.. 2,66,82,156 మంది పురుషులు, 2, 63, 98, 483 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తిరిగి రెండోసారి అధికారంలోకి రాలేదు. కర్ణాటకలోని మొత్తం ఓటర్లలో 17 శాతం లింగాయత్ లు, 15 శాతం మంది వొక్కలిగాలు, 35 శాతం ఓబీసీలు, 18 శాతం ఎస్సి/ఎస్టీలు, 12.92 శాతం ముస్లింలు, 3 శాతం బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ లింగాయత్, వొక్కలిగాలు, ఓబీసీలు కీలకం కానున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 6 గంటల్లోపు క్యూలో నిలబడి ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించనున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ 150 స్థానాల్లో గెలుస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు మీ రోజు, ఈ రోజు కర్ణాటక రాష్ట్రం గెలుస్తుందని తెలుసుకోండి అంటూ ట్విట్టర్‌లో కామెంట్స్ చేశారు. కలబురగిలోని బసవ నగర్‌లో మల్లికార్జున ఖర్గే అతని కుటుంబ సభ్యలు ఓటేసిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బీజేపీతో కర్ణాటక ప్రజలు విసిగిపోయారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుటుంటున్నారని ఖర్గే అన్నారు. తొలి మంత్రి వర్గ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలను నెరవేరుస్తామని చెప్పారు.
Namaskara 🙏
Today is your day!
Ensure that the state of Karnataka wins today.
𝗖𝗵𝗼𝗼𝘀𝗲 𝗣𝗿𝗼𝗴𝗿𝗲𝘀𝘀#CongressWinning150 pic.twitter.com/VVRTnhzC2L
— Congress (@INCIndia) May 10, 2023
కర్ణాటక ఎన్నికల్లో కన్నడ స్టార్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరో ధృవ్ సర్జా బెంగళూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#KarnatakaElections | Kannada actor Dhruva Sarja cast his vote in Bengaluru today. pic.twitter.com/rmjswAUUoM
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక ఎన్నికలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03% ఓటింగ్ నమోదైంది.
52.03% voter turnout recorded till 3 pm, in #KarnatakaElections pic.twitter.com/NTUHWz03Sv
— ANI (@ANI) May 10, 2023
మాండ్యా జిల్లాలోని నారాయణపురా గ్రామంలో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ. మండ్యా ప్రాంతం జేడీయూకు పట్టున్న ప్రాంతం..
VIDEO | Karnataka Elections: Reports of scuffle between workers of JD(S) and Congress-backed Raitha Sangha in Narayanpura village of Mandya district. #KarnatakaAssemblyElections2023 pic.twitter.com/GsF9PUBPGT
— Press Trust of India (@PTI_News) May 10, 2023
కర్ణాటకలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
#WATCH | Delhi: BJP's govt will be formed in Karnataka: Union Minister Sarbananda Sonowal pic.twitter.com/Yl6fMgVvRf
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగళూరులో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తాను సెలబ్రిటీగా ఇక్కడికి రాలేదని.. తాను భారతీయుడిగా వచ్చినట్లు.. ఓటేసిన అనంతరం అని కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అన్నారు.
#WATCH | "Issues are individuals and one should keep their issues in mind and vote accordingly. I've not come here as a celebrity, I've come here as an Indian and it's my responsibility," says Kannada actor Kiccha Sudeep after casting his vote in Bengaluru… pic.twitter.com/CJyYyh6NRp
— ANI (@ANI) May 10, 2023
జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, సతీమణి చెన్నమ్మతో కలిసి హసన్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
JD(S) chief and former Prime Minister HD Devegowda and his wife Chennamma cast their vote for #KarnatakaElections2023, at a polling booth in Hassan pic.twitter.com/jCwwydyzB7
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 38 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
37.25% voter turnout recorded till 1 pm, in #KarnatakaElections pic.twitter.com/YldlIoQwvg
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటకలో విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఈవీఎంలను గ్రామస్థులు పగలగొట్టారు. ఎన్నికల సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులను చితకబాది.. వాళ్ల దగ్గరనున్న ఈవీఎంలను చిత్తుగా పగలగొట్టారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టి కొట్టించి ధ్వంసం చేశారు.
కాంతారతో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా సూచించారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, ఆయన సతీమణి, జేడీ(ఎస్) నేత గీతా శివరాజ్‌కుమార్ ఓటు వేశారు.
#WATCH | Kannada actor Shiva Rajkumar and his wife and JD(S) leader Geetha Shivarajkumar cast their votes for #KarnatakaElections pic.twitter.com/6lnraMa7oz
— ANI (@ANI) May 10, 2023
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన సతీమణి రాధాబాయి ఖర్గే కలబురగిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#WATCH | #KarnatakaElections | Congress national president Mallikarjun Kharge and his wife Radhabai Kharge cast their votes at a polling booth in Kalaburagi. pic.twitter.com/Z6BH4uqwyY
— ANI (@ANI) May 10, 2023
రాష్ట్ర మంత్రి, తిపటూరు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బీసీ నగేష్ కుటుంబసభ్యులు తిపటూరులో ఓటు వేశారు.
#WATCH | #KarnatakaElections | State minister and BJP candidate from Tiptur assembly constituency, BC Nagesh and his family cast their votes in Tipatur. pic.twitter.com/ymkZt8xE2I
— ANI (@ANI) May 10, 2023
కన్నడ నటుడు డాలీ ధనంజయ తన కుటుంబంతో కలిసి అర్సికెరెలోని కాలేనహళ్లి గ్రామంలో ఓటు వేశారు.
#KarnatakaElections | Kannada actor Daali Dhananjaya and his family cast their votes in Kalenahalli Village of Arsikere. pic.twitter.com/dTOywG0Eud
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మైసూరులోని పోలింగ్ బూత్‌లో వధూవరులు తమ కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని నూతన వధూవరులు సూచించారు.
Bride and groom along with their family cast their votes for #KarnatakaAssemblyElection2023 at a polling booth in Mysuru pic.twitter.com/ZaMnNapzty
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు 20.99 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో గ్రేటర్ బెంగళూరులో 55 శాతం పోలింగ్ నమోదైంది.
20.99% voter turnout recorded till 11 am, in #KarnatakaElections pic.twitter.com/Tolo6af49C
— ANI (@ANI) May 10, 2023
మాజీ క్రికెటర్ జావగల్ శ్రీనాథ్ మైసూరులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యం కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన అభ్యర్థించారు.
#WATCH | #KarnatakaElection | Former cricketer Javagal Srinath cast his vote at a polling station in Mysuru.
He says, "...I request people to come, vote & choose a good leader for good democracy. I also voted...We must participate in democracy..." pic.twitter.com/RRDGX9l8W3
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి రామనగరలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Former Karnataka CM & JDS leader HD Kumaraswamy casts his vote for #KarnatakaAssemblyElection2023, at a polling booth in Ramanagara pic.twitter.com/EgTUuroFAO
— ANI (@ANI) May 10, 2023
కన్నడ నటుడు ఉపేంద్ర బెంగళూరులోని ఓ పోలింగ్ బూత్‌లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన ఓటేశారు.
#WATCH | Actor Upendra Rao casts his vote for #KarnatakaElections2023, at a polling booth in Bengaluru pic.twitter.com/tqSbieqyot
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక మాజీ సీఎం, వరుణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామయ్య తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Former Karnataka CM and Congress candidate from Varuna constituency, Siddaramaiah casts his vote for #KarnatakaElection pic.twitter.com/SPjUIzCOcF
— ANI (@ANI) May 10, 2023
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కు పూలమాల వేసి దాని సమీపంలో అగరబత్తీలు కాల్చి పూజలు చేశారు.
#WATCH | Congress workers garland an LPG gas cylinder and burn incense sticks near it, in Bengaluru's Rajarajeshwari Nagar area#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/f3v8XBwswS
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప శివమొగ్గలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#WATCH | #KarnatakaAssemblyElection2023 | Senior Karnataka BJP leader KS Eshwarappa casts his vote at a polling booth in Shivamogga. pic.twitter.com/JBzvEKLad4
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వరుణ దేవాలయంలో పూజలు చేశారు. అంతకు ముందు మాట్లాడుతూ.. పని చేసే పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో ఈ దేశ భవిష్యత్తు కూడా ఇమిడి ఉందని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్‌కు 130 నుంచి 150 సీట్లు వస్తాయని తాను ఎప్పటినుంచో చెబుతున్నానన్నారు.
#WATCH | Former Karnataka CM and Congress leader Siddaramaiah offers prayers at a temple in Varuna#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/qd7GtAOFdR
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా హెబ్బల్ నియోజకవర్గంలో ఓటు వేశారు.
#WATCH | Karnataka Chief Electoral Officer Manoj Kumar Meena casts his vote at Hebbal constituency#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/ateaP2f85M
— ANI (@ANI) May 10, 2023
కాసేపట్లో పెళ్లనగా.. ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు. కర్ణాటకలో ఓ వధువు ఓటు హక్కు వినియోగించుకుని పెళ్లికి రెడీ అయింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగళూరులోని ఓ పోలింగ్ బూత్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Union Minister & BJP leader Shobha Karandlaje arrives at a polling booth in Bengaluru to cast her vote for #KarnatakaElections pic.twitter.com/m0oOukUiJq
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక మంత్రి, బీజేపీ నాయకుడు నారాయణ గౌడ తన కుటుంబంతో కలిసి మాండ్యాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#WATCH | Karnataka minister & BJP leader Narayana Gowda along with his family cast his vote at a polling booth in Mandya pic.twitter.com/qI9VI9oA2o
— ANI (@ANI) May 10, 2023
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బల్లిలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. "ప్రజలు ఈ ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది" అని ఆయన చెప్పారు.
#WATCH | Union Minister and BJP MP from Dharwad constituency, Pralhad Joshi, arrives at a polling booth in Hubballi to cast his vote for #KarnatakaAssemblyElection2023
"I'm happy that people are celebrating this festival of democracy in a big way. People are interested to bring… pic.twitter.com/dKzm3o6va8
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ సీఎం యడియూరప్ప, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు 13 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో గ్రేటర్ బెంగళూరులో 55 శాతం పోలింగ్ నమోదైంది.
మంగళూరులోని పోలింగ్ బూత్‌లో బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | BJP Karnataka president Nalin Kumar Kateel arrives at a polling booth in Mangaluru to cast his vote for #KarnatakaElections pic.twitter.com/osMt9InD8K
— ANI (@ANI) May 10, 2023
ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | RSS General Secretary Dattatreya Hosabale casts his vote for #KarnatakaElections pic.twitter.com/ziu4H3XETN
— ANI (@ANI) May 10, 2023
చిక్కమగళూరులోని పోలింగ్ బూత్ నంబర్ 165లో ఓ వధువు ఓటు వేసింది.
#KarnatakaElections | A bride casts her vote at polling booth number 165 in Chikkamagaluru. pic.twitter.com/nwmd6SzVoW
— ANI (@ANI) May 10, 2023
కన్నడ నటుడు గణేష్ ఆయన భార్యతో కలిసి వచ్చి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు.
#WATCH | #KarnatakaAssemblyElection2023 | Kannada actor Ganesh and his wife arrive at a polling booth in RR nagar, Bengaluru to cast their votes. pic.twitter.com/SntYHY7KqL
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి మరి ఓటేయడం గమనార్హం.
#WATCH | Karnataka CM and BJP candidate from Shiggaon assembly constituency, Basavaraj Bommai queues up at a polling booth here to cast his vote.#KarnatakaElections pic.twitter.com/kvTX5fQFBq
— ANI (@ANI) May 10, 2023
కన్నడ నటుడు రమేష్ అరవింద్ బెంగళూరులోని పోలింగ్ బూత్‌కు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | #KarnatakaElections | Kannada actor Ramesh Aravind arrives at a polling booth in Bengaluru to cast his vote. pic.twitter.com/RwgUcneoU9
— ANI (@ANI) May 10, 2023
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన ఓటు వేయడానికి బెంగళూరులోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి తన ఓటు వేసిన తర్వాత యువ ఓటర్లకు సందేశం ఇచ్చారు. "దయచేసి మమ్మల్ని చూడండి. మేము పెద్దవాళ్ళం కానీ మేము 6 గంటలకు లేచి ఇక్కడకు వచ్చి ఓటు వేశాం. దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి. ఓటు ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం.." అని సందేశం ఇచ్చారు.
#WATCH | Infosys founder Narayana Murthy arrives at a polling booth in Bengaluru to cast his vote.#KarnatakaElections pic.twitter.com/uhQv2RMUVU
— ANI (@ANI) May 10, 2023
#WATCH | Jayanagar, Bengaluru | Sudha Murty gives a message to young voters after casting her vote; says, "Please look at us. We are oldies but we get up at 6 o'clock, come here and vote. Please learn from us. Voting is a sacred part of democracy..."#KarnatakaElections pic.twitter.com/B1ecZCH93M
— ANI (@ANI) May 10, 2023
బీదర్‌లోని భాల్కీ ప్రాంతంలో కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే ఓటు వేశారు.
Eshwar Khandre, working president of Karnataka Congress, casts his vote in Bidar's Bhalki area #KarnatakaElections pic.twitter.com/Ti1xBFaTcO
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక మంత్రులు అరగ జ్ఞానేంద్ర, సీఎన్ అశ్వత్ నారాయణ్, కె.సుధాకర్, ఆర్.అశోకాలు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి వారి నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌లతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ వచ్చి ఓట్లు వేయాలని వారు అభ్యర్థించారు.
#WATCH | Karnataka Home Minister Araga Jnanendra and his family cast their votes in Thirthahalli.#KarnatakaAssemblyElection2023 pic.twitter.com/JpTc4bBYYc
— ANI (@ANI) May 10, 2023
Karnataka Minister CN Ashwath Narayan casts his vote for #KarnatakaElections2023, at a polling booth in Bengaluru
"I request all people to come and cast their votes," he says pic.twitter.com/2tv2IbpTtq
— ANI (@ANI) May 10, 2023
Karnataka Minister and BJP leader K Sudhakar casts his vote for #KarnatakaElections2023, at a polling booth in Chikkaballapur pic.twitter.com/6Vg6IA9aNB
— ANI (@ANI) May 10, 2023
Karnataka Minister & BJP candidate from Kanakpura constituency R Ashoka casts his vote for #KarnatakaElections2023 pic.twitter.com/PJrAje6hT5
— ANI (@ANI) May 10, 2023
కన్నడ నటి అమూల్య, ఆమె భర్త బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#WATCH | #KarnatakaAssemblyElection2023 | Kannada actress Amulya and her husband cast their votes at a polling booth in RR Nagar, Bengaluru. pic.twitter.com/7T8BXynRro
— ANI (@ANI) May 10, 2023
కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ బెంగళూరులో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు.
#WATCH | Union Finance Minister & BJP leader Nirmala Sitharaman arrives at a polling booth in Bengaluru to cast her vote.#KarnatakaElections pic.twitter.com/E8zdPRZCBT
— ANI (@ANI) May 10, 2023
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప తన కుటుంబ సమేతంగా శికారిపూర్‌లోని శ్రీ హుచ్చరాయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఆయన కుమారుడు బీవై విజయేంద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
#WATCH | #KarnatakaElections | Former Karnataka CM and senior BJP leader BS Yediyurappa visits and offers prayers at Sri Huccharaya Swami Temple in Shikaripur, along with his family.
His son, BY Vijayendra is contesting from the Assembly constituency. pic.twitter.com/ncasRIzhNe
— ANI (@ANI) May 10, 2023