బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఇక, మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. నేడు మూడవ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వైభవం కొనసాగుతోంది. ఇవాళ మహాలక్ష్మీ అవతారంలో దర్శనం ఇస్తున్నారు.. కనకదుర్గ అమ్మవారు. అమ్మలగన్న అమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ మహాలక్ష్మీ దేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం సారె ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు వైదిక కమిటీ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి ఆషాడ మాసం సారె సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బెజవాడ కనకదుర్గ దేవికి నగరం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారెను సమర్పించుకున్నారు.
Minister Srinivas Goud: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి వచ్చాను.. దర్శనం బాగా జరిగిందన్న ఆయన.. రాష్ట్ర విభజన ముందు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గొడవలు లేకుండా ఉన్నారు.. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లపై దాడులు జరుగుతాయి అన్నారు.. జరిగాయా? అని ప్రశ్నించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి, సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్న ఆయన..…
Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. విజయదశమి కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే భవానీలు…
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి…