ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం సారె ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు వైదిక కమిటీ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి ఆషాడ మాసం సారె సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బెజవాడ కనకదుర్గ దేవికి నగరం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారెను సమర్పించుకున్నారు. వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్‌ను అమ్మవారికి సమర్పించడం జరిగింది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాడ మాసం సారెను అమ్మవారికి సమర్పించామన్నారు. ప్రతి ఏడాది ఆషాడమాసంలో శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ వెల్లడించింది.
Read Also: Health Tips :గర్భిణీలు రోజూ తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే.
జులై 1, 2, 3 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు జరుగనున్నాయి. వివిధ అవతారలతో మూడు రోజుల పాటు దుర్గమ్మ దర్శనం ఇవనున్నారు. ఈ ఆషాడ మాసంలో హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల కమిటీ అమ్మవారికి బంగారపు బోనం సమర్పించారు. ఆషాడమాసం సారె సమర్పించే కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కనకదుర్గ అమ్మవారి దర్శించుకుని ఆమె ఆశీస్సులు తీసుకుంటున్నారు.
Read Also: Maharashtra: బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయేందుకు టీనేజ్ బాలిక కిడ్నాప్ డ్రామా..