గత నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనకదుర్గమ్మను దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కి దుర్గమ్మ గుడిలో పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేకంగా ఖరీదైన చీర బహూకరించారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మకు చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దగ్గర్లో ఉన్నా అమ్మవారిని దర్శించుకోలేక పోయానని, ఆమె చల్లని చూపులు తనపై ఉంటాయన్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ దుర్గమ్మ అమ్మవారికి మొక్కుగా చెల్లించిన చీరకు యమా క్రేజ్ ఏర్పడింది. ధర ఎంతైనా కొనుగోలుకు మహిళల సిఫారసులు దుర్గగుడి అధికారులు, కాంట్రాక్టరుపై ఒత్తిళ్లకు కారణం అవుతోంది.
Read Also: Revanth Reddy: ప్రగతిభవన్‌పై రేవంత్ కామెంట్స్.. బీఆర్‌ఎస్ నేతలు సీరియస్
అయితే మెగా కుటుంబానికే ఆ చీర ఇవ్వాలని కాంట్రాక్టరు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ దుర్గమ్మ వారికి రూ.8వేల విలువైన చీరను సమర్పించారు. ఆ చీరను అర్చకులు అమ్మవారికి అలంకరించారు. తర్వాత అది దేవస్థానం చీరల కాంట్రాక్టర్ వద్దకు చేరింది. పవన్ కల్యాణ్ సమర్పించడం, దాన్ని అమ్మవారికి అలంకరించడంతో ఈ చీరను కొనుగోలు చేయడానికి మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ధర ఎంతైనా ఆ చీర మాకు ఇప్పించండంటూ పోటీ పెరగడంతో అటు అధికారులకు, ఇటు కాంట్రాక్టర్లకు భారంగా మారింది.
దీంతో కాంట్రాక్టర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతముందు చిరంజీవి సతీమణి సురేఖ ఓ చీరను అమ్మవారికి కానుకగా ఇచ్చారు. దాన్ని కొనుగోలు చేయడానికి పోటీ ఎక్కువగా ఉండడంతో కొద్దినెలల తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ కు ఆ చీరను కానుకగా ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా ఈ చీరను చిరంజీవి, నాగబాబు, పవన్ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇస్తే బాగుంటుందన్న భావనలో కాంట్రాక్టర్ ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇచ్చిన చీర మళ్ళీ ఆకుటుంబానికే చేరనుంది.
Read Also: Horrible incident: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. కారణం ఏంటంటే..