Bandi sanjay: ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ బండి సంజయ్ మాత్రం ఈ నెల 15న విచారణకు రాలేనని, 18న వస్తానని లేఖ రాశారు. దీనిపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్ 18న రావాలని పేర్కొంది. విచారణకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఆయన అభ్యర్థన మేరకు తెలంగాణ మహిళా కమిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కమిషన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.కానీ దీనిపై స్పందించిన బండి సంజయ్.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం విచారణకు హాజరు కాలేనని మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు లేఖ రాశారు. పార్లమెంటును 18వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్ ఈ నెల 18న ఉదయం 11 గంటలకు స్వయంగా విచారణకు హాజరుకావాలని సూచించింది.
Read also: Atrocity on 4 year child: శంషాబాద్‌లో దారుణం.. 4ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
కాగా తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. అంతేకాకుండా.. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ఈనేపథ్యంలో.. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు.. ఇటు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా.. బండి సంజయ్‌కు, బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా.. జీహెచ్‌ఎంపీ మేయర్ విజయలక్ష్మితో పాటు.. పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లగా వారికి అపాయింట్‌మెంట్ లభించలేదు.
Atrocity on 4 year child: శంషాబాద్‌లో దారుణం.. 4ఏళ్ల చిన్నారిపై అత్యాచారం