సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. "మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పండి. అప్పుడు మేము మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతాం.
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి.
Uttam Kumar Reddy : మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులను పూర్తి చేయకుండా వదిలేసిందని మండిపడ్డారు. ఆ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని అందరూ చూడటానికి ప్రభుత్వం…
TPCC Mahesh Goud : ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, మాజీ మంత్రులుగా కనీస మినహాయింపు లేకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం సిగ్గుచేటని టిడిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులమడం అలవాటైపోయిందని, శవాలపై రాజకీయం చేయడం వారి నైజమని ఆయన ధ్వజమెత్తారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 24 గంటల పాటు రిస్క్యూ టీమ్స్…
Harish Rao : తెలంగాణలో ప్రాజెక్టుల కూల్చివేత, పాలకపక్షం-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతూ, “కొంతమంది మూర్ఖులు గాంధీ భవన్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిపోయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఓ మూర్ఖులారా! ఒక్కసారి సిద్ధిపేటకి వచ్చి గలగల పారుతున్న గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి,” అంటూ హరీష్ రావు ఘాటుగా స్పందించారు. హరీష్ రావు…
Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయని, కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి…
KTR : తెలంగాణలో సాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల గత ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండిపోయాయని, సాగునీటి крైసిస్ అన్నదాతలను ఆత్మహత్యలకు దారి తీస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకునేందుకు సరిపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లను తగిన విధంగా…
Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాఘట్టం మహాకుంభాభిషేకం నేడు (ఆదివారం) వైభవంగా నిర్వహించారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ మహకుంభాభిషేకం పూజలు ఘనంగా జరుగాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, రాజగోపురాల కలశాల సంప్రోక్షణ పూజలు, మహాకుంభాభిషేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండ సురేఖ, మాజీ ఎంపీ పొన్నం…
కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌ను సంస్థ విచారించింది. అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది..
‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్గా గుర్తించి.. అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు.