Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకూడదని కేసీఆర్, హరీశ్…
‘లక్కీ డ్రా’ అంటే.. మధ్యతరగతి జనాలకు ఎక్కడ లేని ఆశ పుట్టుకొస్తుంది. లక్కీ డ్రాలో ఫ్రీగా బైక్, కార్, ఏసీ, బంగారం, నగదు, ప్రాపర్టీలు గెలుపొందచ్చన్న ఆశతో చాలామంది స్కీమ్‌లు వేస్తుంటారు. లక్కీ డ్రాలలో కొన్ని నిజమైనవే ఉండగా.. మరికొన్ని మోసాలు కూడా ఉంటాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ జనాలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అందుకే కొత్త కొత్త లక్కీ డ్రాలు వేస్తుంటారు. తాజాగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రస్తుతం ఓ లక్కీ…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్‌లో ఎలాంటి ప్రకంపనలు రేగుతున్నాయో... ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదంతా ప్రాజెక్ట్ నిర్మాణం చుట్టూ జరుగుతున్న రచ్చ. ఫ్రంట్ పోర్షన్‌లో ఆ స్థాయి రచ్చ జరుగుతుంటే... బ్యాక్‌లో కూడా ఆ స్థాయి కాకున్నా... దాదాపు అలాంటి గొడవే జరుగుతోంది. అక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయ లబ్దికోసం పావులు కదుపుతూ పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నాయి.
ఆ ఐఏఎస్ అధికారులకు కొత్త టెన్షన్ పట్టుకుందా? గండం గట్టెక్కాంరా.. దేవుడా అని ఊపిరి పీల్చుకుంటున్న టైంలో... పిడుగు పడ్డట్టయిందా? మళ్ళీ క్వశ్చన్ టైం వచ్చేసిందంటూ టెన్షన్ పడుతున్నారా? చివరికి కొందరు రిటైర్డ్ ఐఎఎస్‌లకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందా?
కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?అని ఆమె వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అసెంబ్లీలో చర్చించాక తదుపరి చర్యల మాటేంటి? ఏ తరహా ఎంక్వైరీ వేయబోతోంది? దర్యాప్తు అధికారాన్ని తన పరిధిలోనే ఉంచుకుంటుందా? లేక బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు సీబీఐకి అప్పగిస్తుందా?
కాళేశ్వరం రిపోర్ట్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు... ఏం చేయబోతున్నారు ? సీఎస్ రామకృష్ణారావు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హరీశ్‌రావుకు ఇస్తారా? అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే... అంతకు ముందే కమిషన్ నివేదికపై మాజీ మంత్రి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా ? కాళేశ్వరంపై తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది ?
KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాగాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిర్వహించనున్నారు. ఈరోజు యాగం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. రేపటి నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుంది. Pulaparthi Nani: లిక్కర్…
Kaleshwaram Commission Report: ఒకట్రెండు రోజుల్లో కాళేశ్వరం కమీషన్ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వంకు ఇవ్వనుంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ నివేదికను సీల్డ్ కవర్లో ఉంచారు. దాదాపు 500 పేజీలతో తుది నివేదికను కమిషన్ ఇవ్వనుంది. 3 వేల పేజీలతో మొత్తం డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు ఒకటి లేదా రెండో తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికను స్వీకరించి.. ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల…