Kaleshwaram : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది మరోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నదికి వచ్చే వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో పుష్కర ఘాట్ల వద్ద అలముకున్న తాత్కాలిక వ్యాపార స్థలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటి వరకు నీటి కొరతతో వెలిసిన నదీ తీరంలో గుడారాలు వేసుకుని వ్యాపార కార్యకలాపాలు సాగించిన స్థానికులు, వరద ఉధృతికి అవన్నీ కోల్పోయారు. మరోవైపు, నీటి ఉధృతి…
Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ చర్చ సాగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అధికారులు, మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ…
Harish Rao : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని మూడు దశల్లో బనకచర్ల వరకు తరలించేందుకు కేంద్రానికి PFR సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు…
కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను మాజీ మంత్రి హరీష్ ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామన్నారు. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదన్నారు. ఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటిలో నేను, ఈటల, తుమ్మల ఉన్నామని తెలిపారు. సబ్ కమిటీ రిపోర్ట్ పై నాతో పాటు…
కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని హరీష్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.. కానీ, కేసీఆర్ గారి ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల…
Saraswati Pushkaralu : కాళేశ్వరంలో ఆధ్యాత్మికతతో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుంటున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక…
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండగకు విడుదల చేసిన 35 కోట్ల రూపాయలు ఏర్పాట్లకు సరిపోవన్నారు.
Saraswati Pushkaralu : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక…
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో కాళేశ్వరం బయలుదేరుతారు. కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతీ పుష్కర ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటలకు…