Bhatti Vikramarka : బోనస్ ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్నారని, పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం లేకుండానే గతములో కట్టిన ప్రాజెక్టుల తోటే ధాన్యం రికార్డు స్థాయి లో పండుతుందన్నారు. రైతులకు మేము చేసినంత గా ఎవ్వరూ చేయలేదని, మీరు రైతులను ఎంత మోసం చేశారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలం లోనే 21…
కాళేశ్వరం నీటి చుక్క వాడకుండానే ఎల్లంపల్లి నుంచి నీరు పొదుపుగా వాడుకొని పెద్ద ఎత్తున వరి పంట పండించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఉంటే ఇప్పటికైనా క్లియర్ చేయాలని ఆయన సూచించారు.
Karthika Somavaaram:ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి.
మాజీ మంత్రి హరీష్ రావు పై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని తప్పయింది మేము రాజన్న కి ఇచ్చిన మాట తప్పాము అని క్షమించు అని ఆడుగుతాడు అనుకున్నామని, సోనియా తెలంగాణ ఇస్తేనే కదా కేసీఆర్ సీఎం అయ్యాడు, మీకు పదవులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు.
కాలేజీ అమ్మాయిల స్కూటీ లు ఎటు పాయే.. సీఎం రేవంత్ ట్వీట్ పై డీకే అరుణ ఫైర్.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఒక్క ఇల్లు మొదల పెట్టలేదన్నారు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? అని ప్రశ్నించారు. రైతు…
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. శనివారం, సీఈ సుధాకర్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా, సుధాకర్ రెడ్డి తనిఖీలు లేకుండా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు కేటాయించినట్లు వివరించారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు చేసే సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు చెప్పారు.…
KTR: యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Ponnam Prabhakar: ఆగస్టు 2 కూడా వస్తుంది పోతుందని కేటీఆర్ కు రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేది ఏం లేదన్నారు. ఆగస్టు 2 కూడా వస్తుంది..పోతుందన్నారు. కాళేశ్వరం లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసన్నారు. కేంద్రం నుండి నిధులు తెప్పించు కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు. హైదరాబాద్ కి ఒక్క పైసా ఇప్పించలేదు మీరు…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజుల నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తడంతో గోదావరికి భారీ ప్రవాహం వచ్చి చేరుతోంది. తీరం వద్ద 12.100 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది.
ఆగస్టు 2 లోపు కాళేశ్వరం నుంచి పంపింగ్ స్టార్ట్ చేయకపోతే రైతులతో కలిసి మేమే పంపులు ఆన్ చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలించి మాట్లాడారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదనే ఉద్దేశతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన వెల్లడించారు.