సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం జనాలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాణాలకు తెగించి మరీ కొందరు అరుదైన ఫీట్లు సాధిస్తున్నారు. మరి కొందరు ఒళ్లు గగ్గురుపుడిచే విన్యాసాలు చేస్తున్నారు. తాము పెట్టే పోస్టులకు వ్యూస్, లైక్స్, కామెంట్స్ కోసం అన్నింటికీ తెగిస్తున్నారు. అయితే ఈ కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలా మంది ఫేమస్ అవుతున్నారు. వారు చేసే చిన్న చిన్న పనులు, డ్యాన్స్, పాటలతో వైరల్ గా మారుతున్నారు. ఈ క్రమంలో.. తాము కూడా ఫేమస్ అవ్వాలని యువత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను తెగ వాడేసుకుంటుంది. ఇందుకోసం ఎంతటి ప్రమాదాలు వచ్చినా పట్టించుకోవడం లేదు. లైకులు, కామెంట్ల కోసం దేనికీ వెనుకాడటం లేదు. ఇలాంటి వీడియోలో నెట్టింట్లో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Also: QG Gang War Trailer: ‘క్యూజీ గ్యాంగ్‌వార్’ ట్రైలర్ విడుదల.. అదరగొట్టేసిన ప్రియమణి, సన్నీలియోన్
ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ స్టైల్లో కొందరు యువకులు డ్యాన్స్ చేశారు. అసలు విషయమేంటంటే.. ఒక యువకుడు చేతిలో కొండచిలువను పట్టుకుని వీధిలో డ్యాన్స్ చేసుకుంటూ విన్యాసాలు చేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగింది. వీరు జాతరలో కొండచిలువలను ఆడించే వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైల్డ్ లైన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశారు. ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ప్రమాదకరమైన కొండ చిలువలను జనాల్లోకి తీసుకుని వెళ్ళినందుకు చర్యలు తీసుకున్నారు. ఫారెస్ట్ అధికారులు వారి వద్ద నుంచి మూడు కొండచిలువలను స్వాధీనం చేసుకున్నారు. అనంరం ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుచనున్నారు.
Read Also: Maharashtra: కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం.. గతేడాది మోడీ ఆవిష్కరణ