కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఇమిటేట్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ఇమిటేట్ చేశారు. ‘చంద్రన్న వస్తే 20 వేలు ఇస్తాడు, జగన్ అయితే 13 వేలే కదా.. చిన్న పిల్లలు కనపడితే నీకు 15 వేలు, నీకు 15 వేలు’ అంటూ చిన్న పిల్లల వైపు వేలు చూపిస్తూ చంద్రబాబులా ఇమిటేట్ చేశారు. అక్కడున్న జనలంతా జగన్ చూసి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
Arvind Kejriwal: 156 రోజుల జైలు జీవితం.. సీఎం కేజ్రీవాల్ విడుదల
‘జగన్ అయితే అమ్మఒడి కింద 15 వేలు మాత్రమే వేస్తాడు.. అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పిన విధంగా నీకు 15 వేలు, నీకు 15 వేలు వేస్తాడని పిల్లలను మోసం చేశాడు.. అక్కా చెళ్లెల్లను మోసం చేశాడని జగన్ ఆరోపించారు. అదే విధంగా.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సంవత్సరానికి 18 వేలు ఇస్తారని.. నీకు 18 వేలు, నీకు 18 వేలు మహిళలందరికీ 18 వేలు ఇస్తానని చెప్పాడన్నారు. అంతటితో ఆగకుండా 50 ఏళ్లకు పైగా మహిళలకు జగన్ అయితే.. 18 వేలు ఇస్తాడు. చంద్రన్న అయితే 48 వేలు ఇస్తానని అమ్మలను మోసం చేశాడని చెప్పారు. ఇంట్లో నుంచి 20 ఏళ్ల యువకుడు బయటకు వస్తే.. నెలకు 3 వేలు, సంవత్సరానికి 36 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.’ ఎన్నికలు అయిపోయి 4 నెలలు అవుతుంది.. పిల్లలు స్కూళ్లకు పోతున్నారు.. అమ్మఒడి పోయింది.. రైతు భరోసా సొమ్ము పోయింది.. చేయూత పోయింది.. సున్నా వడ్డీ పోయింది.. ఆసరా పోయింది.. అంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.