జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు.. దీనికోసం బుధవారం రోజు కాకినాడ చేరుకున్నారు జనసేనాని.. ఇక, మూడు రోజుల పాటు అంటే.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అక్కడే మకాం వేయనున్నారు.
Kakinada Doctor committed Suicide: కాకినాడలో యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్‌నగర్‌కు చెందిన వైద్యుడు నున్న శ్రీకిరణ్ చౌదరి (32) శనివారం గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్‌హెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. ఆస్తి విషయమై శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. Also Read: Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు..…
రేపు(గురువారం) కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. పది గంటలకు పెద్దాపురం చేరుకోనున్నారు. పది నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో ఇంటరాక్షన్ కానున్నారు.
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే ఆయన గెలుస్తున్నాడని మంత్రి సీదిరి అన్నారు. కుప్పంలోనే 30 నుంచి 40వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే భయంతో బాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ మంత్రి మండిపడ్డారు.
Student dies after Scorpion sting in Class Room: క్లాస్ రూమ్‌లో తేలు కుట్టి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తుండగా రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడు. దాంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం…
ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.. 20 మందికి పైగా ప్రయాణీకుల కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. వివరాళ్లోకి వెళితే.. ఏపీ కాకినాడ లో ఈ ప్రమాదం జరిగింది.. కాకినాడ నుండి కర్నూల్ కు వెళుతున్న ఆర్టిసి బస్సు ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై వేగంగా…
రాజకీయ స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తిని కాదు.. జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవన ప్రమాణస్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది అని కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేశారు..