CM YS Jagan: లోకల్ హీరో (వంగా గీత) కావాలా? సినిమా హీరో (పవన్ కల్యాణ్) కావాలా? మీరే ఆలోచించుకోవాలి అంటూ పిఠాపురం ప్రజలకు సూచించారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాకినాడలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో అభ్యర్థులను పరిచయం చేస్తూ.. గెలిపించాలని కోరిన ఆయన.. ఇక, పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతను పరిచయం చేస్తూ.. ‘పిఠాపురం నుంచి నాకు తల్లిలాంటిది.. నా అక్క గీతమ్మ నిలబడుతోంది.. పిఠాపురంలోని ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి.. లోకల్ హీరో కావాలా? లేకపోతే సినిమా హీరో కావాల్నా ఆలోచన చేసుకోవాలన్నారు.. అక్కకు ఓటు వేస్తే ఎప్పుడూ మీతోనే ఉంటుంది.. మీకు మంచి చేస్తుంది.. నేను కూడా దగ్గరుండి అక్కతో మంచి చేయిస్తాను.. కానీ, సినిమా హీరోకు ఓటు వేస్తే.. ఓటు వేయించుకునేవరకు మాత్రమే ఇక్కడ ఉంటాడు.. జ్వరం వచ్చినా కానీ, మళ్లీ అతడు హైదరాబాద్‌కు వెళ్లిపోతాడు.. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.. వంగా గీతపై మీ దీవెనలు ఉండాలని కోరారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Ranjith Reddy: ఎర్రటి ఎండలోనూ ప్రజల చెంతకు.. ప్రచారంలో జోరు పెంచిన రంజిత్ రెడ్డి
ఇక, ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు.. ఇంటింట ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? అని ప్రశ్నించారు సీఎం జగన్.. జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్ జరుగుతోందన్న ఆయన.. ఈ యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది.. ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. అయితే, ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ.. ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు జరుగుతుంది.. ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి.. లేదంటే.. చంద్రబాబు మార్క్‌తో ముగింపు.. ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం.. ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు.. ఫ్యాన్‌కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్ కంటెంట్.. ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్ బోధన, ఐఎఫ్‌బీ ప్యానల్స్, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇలా ప్రభుత్వ పథకాలను చెప్పుకొచ్చారు సీఎం వైఎస్ జగన్.