కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం సచివాలయం దగ్గర గ్రామస్థులతో సీఎం మాట్లాడారు. ఏలేరు వరద ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బుడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా వంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుడమేరు ఆక్రమణలు చాలా మంది తెలిసో తెలియకో చేసిన వారు ఉన్నారని ఆయన అన్నారు. ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారన్నారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ , పంట పొలాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఏపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ.. పిఠాపురంలోని జగనన్న కాలనీ, సూరంపేట వరద బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
సోదరసోదరీణుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వేళ కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చెల్లి దుర్మరణం పాలైంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపట్నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రెడి అయ్యారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. జులై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ప్రకటించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు డయేరియా బాధితుల సంఖ్య 210కి చేరగా.. ఆస్పత్రుల నుంచి140 మంది డిశ్చార్జ్ అయ్యారు. డయేరియాతో కొమ్మనాపల్లికి చెందిన నాగమణి, వేట్లపాలెంకు చెందిన సత్యవతి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.