Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్.. తొలిరోజు పర్యటనను పెన్షన్ల పంపిణీతో ప్రారంభించారు.. నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం రెండో రోజు పర్యటన కొనసాగనుంది.. కాకినాడ కలెక్టరేట్ లో ఈ రోజు కీలక సమీక్షా సమావేశం నిర్వమించబోతున్నారు.. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్ డబ్ల్యూ ఎస్, అటవీశాఖ, పొల్యూషన్ అధికారులతో విడివిడిగా రివ్యూలు నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్.. అయితే, ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులకు ఇప్పటికే కీలక సూచనలు చేశారు జిల్లా కలెక్టర్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించే సమావేశానికి పెండింగ్ ప్రాజెక్టులు, శాఖాపరమైన సమగ్ర సమాచారంతో రావాలని ఆదేశాలు ఇచ్చారు.. మరోవైపు.. సాయంత్రం గొల్లప్రోలులోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Read Also: Astrology: జులై 02, మంగళవారం దినఫలాలు
ఇక, సోమవారం పర్యటనలో భాగంగా.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలతో సమావేశమయ్యారు పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటే ఏదైనా జరుగుతుందన్నారు. ప్రపంచం గుర్తించేలా పిఠాపురం నుంచి మార్పు ప్రారంభించాలని సంకల్పిస్తున్నామని చెప్పారు. మీ గొంతే నా గొంతు మీ కలే నా కల అన్నారు. గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టి ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని గుర్తుచేశారు. పదవులు వచ్చినంత మాత్రనా తల ఎగుర వేయకూడదని పేర్కొన్నారు. వ్యక్తిగత ద్యేషాలకు విధ్వాంశాలకు పాల్పడవద్దని కార్యకర్తలకు నాయకులకు సూచించారు. ప్రతిపక్షం లేదని అనుకోవద్దు సమస్య వచ్చినప్పుడు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.