ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు డయేరియా బాధితుల సంఖ్య 210కి చేరగా.. ఆస్పత్రుల నుంచి140 మంది డిశ్చార్జ్ అయ్యారు. డయేరియాతో కొమ్మనాపల్లికి చెందిన నాగమణి, వేట్లపాలెంకు చెందిన సత్యవతి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసురుతుంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలోని గ్రామస్తులు డయేరియా బారిన పడుతున్నారు. సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రిలో చేరుతున్నారు.
కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. న్యూఇయర్ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తునిలోని సాయి వేదిక ఫంక్షన్ హల్‌లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకం ప్రారంభం కాకినాడ జిల్లా లో జరుగనుంది. అయితే, తాజాగా సామర్లకోటలో ఈటీసీ లే అవుట్‌లో పేదలకు నిర్మించిన గృహాలను సామూహికంగా ప్రారంభించేందుకు, పైలాన్ ఆవిష్కరణ తదితర కార్యక్రమాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబరు 12వ తారీఖున వెళ్లనున్నారు.
Kakinada: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా మేజిక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా మ్యాజిక్‌లో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. Read Also: కాగా ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న…
AP Govt School: రెండు తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఇంగ్లిష్ మాట్లాడటం కాదు కదా కనీసం చూసి (పర్ఫెక్టుగా) చదవటం కూడా రాదనే చులకన భావం చాలా మందిలో ఉంది. అసలు తెలుగు అక్షరాలనే సరిగా గుర్తించలేకపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరానికి సమీపంలో ఉన్న బెండపూడి ప్రభుత్వ బడి పిల్లలు ఆంగ్లాన్ని అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇండియన్ ఇంగ్లిష్ కాదు. ఏకంగా అమెరికా ఇంగ్లిష్నే ఈజీగా దంచికొడుతున్నారు.