Somu Veerraju: ఏపీలోని కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఐఎఫ్‌సీఐ (ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు…
అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని నిర్వహిస్తారు.. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఇది… మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.. మెట్టినింటికి వెళ్లిన తర్వాత పుట్టినింటికి దూరమైన ప్రతీ ఆడపడుచు ఈ పండుగ రోజు ఖచ్చితంగా తన పుట్టింటికి వచ్చే…
ఈమధ్యకాలంలో యువకులు మారణాయుధాలతో తిరుగుతూ కలకలం రేపుతున్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ రాజకీయనాయకుడి బంధువు ఒకరు కత్తితో కేక్ కట్ చేసి, బర్త్ డే వేడుకల్లో హంగామా చేయడం వివాదాస్పదం అయింది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ యువకుడు పిస్టల్ పట్టుకుని హడావిడి చేశాడు. అతని ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ సామర్లకోట పట్టణంలో 27వ వార్డు సాయినగర్ కు చెందిన ఓ యువకుడు పిస్టల్తో ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్…
బంగాళాఖాతంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు గల్లంతవడంతో ఆందోళన నెలకొంది. కాకినాడ జిల్లాలో బంగాళాఖాతంలో ఇంజన్ ఆగి నిలిచిపోయిందో బోటు. పర్లోవపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తమ బోటు భీమునిపట్నం వైపు బోటు కొట్టుకుపోతున్నట్లు సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపారు మత్స్యకారులు. ఆ తరువాత సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో కుటుంబసభ్యులలో ఆందోళన ఏర్పడింది. తమ బోటులో ఇంజన్ ఆగిపోయిందని మత్స్యకారులు సెల్ ఫోన్ ద్వారా సమాచారం పంపారు. సోమవారం నుంచి…