Tragedy: కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో తల్లీ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బట్టలు ఉతుకుతుండగా కరెంట్ తీగ తగిలి తల్లి పద్మ శనివారం మృతి చెందగా.. టిఫిన్ ప్లేట్ పెడుతూ కుమారుడు నాని అక్కడే కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఒకే రోజు వ్యవధిలో కరెంట్ షాక్‌తో తల్లీ కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: Kiccha Sudeep: కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం