Samarlakota Municipality: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్ పై నేడు అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనుంది.. చైర్‌పర్సన్ అరుణ పై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది కౌన్సిలర్లు.. ఆర్జీవో మల్లిబాబు ప్రత్యేక అధికారిగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది.. వైసీపీ తరఫున చైర్‌పర్సన్‌గా ఉంటూ, ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారని అరుణను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ.. అయితే, మున్సిపాలిటీలో మొత్తం 31…
Ramachandrapuram Bandh: నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుండి…
కాకినాడ జిల్లా తాటిపర్తి గ్రామం.. గంగాధర్ సూరిబాబు శ్రీను సమీప బంధువులు.. సూరిబాబు శ్రీను దగ్గర గంగాధర్ అప్పు తీసుకున్నాడు.. ఏమి ఇబ్బందులు వచ్చాయో ఏమోగానీ ఈ మధ్యకాలంలో గంగాధర్ ఆర్థికంగా చితికిపోయాడు.. ఇల్లు కూడా కట్టాడు.. సూరిబాబు గంగాధర్ కలిసి కౌలుకి వ్యవసాయం చేస్తున్నారు.. బంధువులైనప్పటికీ చేసిన అడగడం మామూలే.. అదే రీతిన సూరిబాబు, శ్రీనులు గంగాధర్ ను తీసుకున్న అప్పు చెల్లించాలని ఈ మధ్య తరచూ అడగడం మొదలుపెట్టారు.. వడ్డీ కూడా కట్టకపోవడంతో మరింత…
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.. ఊరి చివర పొలాల మధ్య బావిలో అదే గ్రామానికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలు గుర్తించారు స్థానికులు.. ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన గంగాధర్ చంపి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు..
పుష్ప సినిమా టాలీవుడ్‌నే కాదు.. పాన్ ఇండియా లేవల్లో ఓ ఊపు ఊపింది.. అయితే, ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దర్శకుడు ఉపయోగించిన ట్రిక్కులను.. చాలా సందర్భాల్లో దొంగలు ఉపయోగించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, కాకినాడ జిల్లా జగ్గంపేటలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జగ్గంపేట, కిర్లంపూడి పోలీసులు టోల్‌గేట్ వద్ద అదుపులోనికి తీసుకున్నారు.
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది.. ఎన్నికల అధికారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది.. ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది హాజరు అయ్యారు.. వైసీపీలో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఎన్నికకు దూరంగా ఉన్నారు..
గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన విషయం తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.
కాకినాడ జిల్లా ఏవీ నగరంలో ప్రియుడుతో కలిసి భర్త మధుకి విషంపెట్టి చంపింది భార్య.. స్థానికంగా ఉన్న రిఫరల్ హాస్పిటల్లో పనిచేసే మృతుడి భార్యకి.. అక్కడే పనిచేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా హద్దులు దాటేసింది.. వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఈ విషయం కాస్తా భర్త మధుకు తెలియడంతో.. ఆ కుటుంబంలో గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది..