AP Crime: కాకినాడ జిల్లా తాటిపర్తి గ్రామం.. గంగాధర్ సూరిబాబు శ్రీను సమీప బంధువులు.. సూరిబాబు శ్రీను దగ్గర గంగాధర్ అప్పు తీసుకున్నాడు.. ఏమి ఇబ్బందులు వచ్చాయో ఏమోగానీ ఈ మధ్యకాలంలో గంగాధర్ ఆర్థికంగా చితికిపోయాడు.. ఇల్లు కూడా కట్టాడు.. సూరిబాబు గంగాధర్ కలిసి కౌలుకి వ్యవసాయం చేస్తున్నారు.. బంధువులైనప్పటికీ చేసిన అడగడం మామూలే.. అదే రీతిన సూరిబాబు, శ్రీనులు గంగాధర్ ను తీసుకున్న అప్పు చెల్లించాలని ఈ మధ్య తరచూ అడగడం మొదలుపెట్టారు.. వడ్డీ కూడా కట్టకపోవడంతో మరింత ఒత్తిడి తెచ్చారు.. దాంతో గంగాధర్ ఈ బాధల నుంచి బయటపడాలంటే అప్పు ఇచ్చిన వాళ్లను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.. మంగళవారం రాత్రి తాము కౌలుకి వ్యవసాయం చేస్తున్న పొలం దగ్గరికి శ్రీను సూరిబాబులను పిలిచాడు గంగాధర్.. డబ్బులు విషయం మాట్లాడదామని అన్నాడు వాళ్లు అక్కడికి వచ్చిన తర్వాత మందు కూడా ఆఫర్ చేశాడు.. పొలం దగ్గరే బావి ఉంది.. సూరిబాబు శ్రీనులకు పీకలు దాకా మందు పట్టించాడు.. మొదట వేసుకున్న ప్లాన్ ప్రకారం తాను తాగలేదు.. తాగినట్లు నటించాడు.. ముగ్గురు మధ్య డబ్బులు విషయం డిస్కషన్ వచ్చింది.. కొద్దిగా గందరగోళం జరిగింది శ్రీను సూరిబాబు ఫుల్ కిక్ లో ఉండగా ఒకరి తర్వాత ఒకరిని అతికిరాతకంగా చంపేశాడు.. గంగాధర్ కాళ్లతో తొక్కి పెట్టి ఉన్నాడు.. వాళ్లు చనిపోయారు అని నిర్ణయించుకున్న తర్వాత మృతదేహాలను బావిలో పడేసాడు..
Read Also: CV Anand: పహల్గామ్ బాధితుల కోసం రాజకీయ, సినీ ప్రముఖుల క్రికెట్.. HCAకు సీవీ ఆనంద్ కౌంటర్
ఇద్దరు చనిపోయారు అని నిర్ణయించుకున్న తర్వాత గంగాధర్ మరో ప్లాన్ వేశాడు.. తాను అప్పు తీసుకున్న మూడో వ్యక్తి గ్రామానికి చెందిన సూరిబాబుకి ఫోన్ చేశాడు.. డబ్బులు విషయం మాట్లాడదామని రమ్మన్నాడు.. వెంటనే సూరిబాబు వచ్చాడు.. అతన్ని బైక్ మీద శుద్ధగడ్డ వాగు వరకు తీసుకుని వెళ్ళాడు.. అక్కడ మొబైల్ పోయినట్లు వెతుకుతూ నటించాడు.. సూరిబాబుకి గంగాధర్ వ్యవహార శైలి పై అనుమానం వచ్చింది.. మనిషిలో కంగారు కనిపించింది.. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గంగాధర్ హడావుడి పడడం, మొబైల్ ఎదురుగానే ఉన్న నటించడంతో సూరిబాబు ఏదో జరుగుతుందని అక్కడ నుంచి పారిపోయాడు.. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశాడు.. ఒకవేళ సూరిబాబు గనక అక్కడే ఉండి ఉంటే, అతని కూడా చంపి సుద్ధగడ్డ వాగులో మృతదేహాన్ని పడేద్దామని గంగాధర్ ఫిక్స్ అయ్యాడు.. సూరిబాబు చెప్పిన మాటలతో గంగాధర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
Read Also: Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఒకేసారి అన్ని..!
అయితే, అప్పటికీ అతను రెండు మర్డర్లు చేశాడని పోలీసులకు తెలియలేదు.. తర్వాత బావిలో మృతదేహాలు చూసి విచారణ చేసిన తర్వాత బయటపడింది.. దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.. గంగాధర్ ఎంతమంది దగ్గర అప్పు తీసుకున్నాడు, ఎంతో సాఫ్ట్ గా ఉండే వ్యక్తి ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాడు అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. శ్రీను, సూరిబాబులు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. సమీప బంధువే డబ్బు అప్పుగా ఇచ్చిన పాపానికి కడతేర్చాడని బాధపడుతున్నారు. మొత్తానికి డబ్బులు అప్పుగా ఇచ్చిన పాపానికి ఇద్దరు అన్యాయంగా చనిపోయారు.. ఎప్పుడు కూల్ గా ఉండే గంగాధర్ అతి కిరాతకంగా ప్రవర్తించాడు.. సూరిబాబు రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నాడు.. దీనికి సంబంధించి పోలీసులు మరింత విచారణ చేస్తున్నారు..