తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉదయగిరి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ బీ- ఫామ్ అందుకున్నారు.
పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు వరికుంటపాడు మండలం విరువూరు, కొండాయపాలెం, ధర్మవరం, తోటల చెరువుపల్లి, మహ్మదాపురం, కృష్ణంరాజు పల్లి, తొడుగుపల్లిలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ కాలనీలలో ఎన్నికల ప్రచారాన్ని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లె జనం నీరాజనాలు పలికారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తామని, ఘంటా పదంగా తెలిపారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమృత దార…
ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా మంది వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి.
ఉదయగిరి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వింజమూరు పట్టణంలోని జై భీమ్ నగర్, జీబీకేఆర్ఎస్ టీ కాలనీలో ఆదివారం నాడు తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించాలని కాకర్ల సునీల్ సతీమణి కాకర్ల సురేఖ కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్లోని బి.ఎన్ రెడ్డి నగర్లో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వలసవాసులు అపూర్వ స్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య యువత, ఆడపడుచులు బి.ఎన్.రెడ్డి నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకర్ల సురేష్ కు మేమున్నాము మీకు అని ధైర్యాన్ని నింపి మా అందరి ఓటు సైకిల్ గుర్తు మీద మా పవిత్రమైన ఓటు…
కలిగిరి పట్టణంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కలిగిరి ప్రధాన రహదారి వెంబడి ప్రచారం నిర్వహించారు.
ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం తల్లి కాకర్ల మస్తానమ్మ, అత్త కడియాల పద్మావతి, మామ కడియాల వెంకటేశ్వర్లు కలిగిరి మండలం లక్ష్మీపురం పంచాయతీ కండ్రిక గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.