తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉదయగిరి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ బీ- ఫామ్ అందుకున్నారు. అమరావతిలోని ఎలక పూడి ప్రాంతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి బీ ఫామ్ అందుకున్నారు. అధికార పక్షం విఫలమైన అంశాలను ఎండగట్టి పక్కా ప్రణాళికతో సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరు విజయం సాధించాలని ఈ సందర్భంగా నారా చంద్రబాబు తెలియజేశారు.
Read Also: Yarlagadda VenkatRao: ఇందిరానగర్లో యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం
ఇక, నెల్లూరు జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ మంత్రి నెల్లూరు టౌన్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గుమాటి కృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రె,డ్డి కందుకూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Read Also: Raj Tarun : జీవితంలో ఆ రెండు వద్దంటున్న హీరో.. పెళ్లి పై సంచలన నిర్ణయం..
అలాగే, ఉదయగిరి మండలం వెంగళరావు నగర్ కు చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తమ్ముడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మన్నేటి వెంకటరెడ్డి, కాకర్ల సునీల్ తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోనికి సాధారణంగా ఆహ్వానించారు. గ్రామం మొత్తం తెలుగుదేశంలో చేరింది. అదే విధంగా తిరుమలాపురం పంచాయతీ వాలంటీర్ తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇదే కోవాలో మరి కొంత మంది వాలంటీర్లు టీడీపీలో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మేము సైతం తెలుగుదేశం అంటే అంటూ ఆదరభిమానాలు అందిస్తున్నారు. దీంతో కాకర్ల సురేష్ కి నియోజకవర్గంలో రోజురోజుకీ ఆదరణ పెరిగిపోతుంది. తెలుగుదేశం జిందాబాద్ అంటూ గ్రామాలు గ్రామాలు తరలివస్తున్నాయి. ఇలాగే, కొనసాగితే 50 వేల మెజార్టీ వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు షాక్.. పిటిషనర్‌కు భారీ జరిమానా
అయితే, ఉదయగిరి పట్టణంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కి ఓటు వేయాలని ఆయన మరదలు కాకర్ల సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఎస్కే రియాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయగిరి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం వేషధారణలో కాకర్ల సురేఖ ఓట్లను అభ్యర్థించారు. చంటి బిడ్డలను సంకన ఎత్తుకుని, ముస్లిం మహిళలతో మమేకమై వారి సాధక బాధలను విన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరుతాయన్నారు. ముస్లిం మహిళలు మంగళ హారతులు ఇచ్చి బొట్టు పెట్టిమరి తెలుగుదేశానికే మా ఓటు అని నినాదాలు చేశారు. జిల్లా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు .. లేకుంటే అంధకారంలోకి వెళ్తామని కాకర్ల సురేఖ తెలిపారు.