ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. రానున్న నాలుగేళ్లలో నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తామన్నారు. దేశంలోని కోటి సభ్యత్వం కలిగిన ప్రధాన పార్టీ తెలుగుదేశం అని ఎమ్మెల్యే కాకర్ల కొనియాడారు. వింజమూరు ఎస్వి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కాకర్ల టీడీపీ మహానాడు నిర్వహించారు. మహానాడులో టీడీపీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారకరామారావు నివాళులర్పించారు.…
పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలంలోని దూబగుంట, కృష్ణారెడ్డి పాలెం గ్రామాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉదయగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉదయగిరి మండలం సంజీవ రాజుపల్లి గ్రామం నుంచి బుధవారం పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.
ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాకర్ల సురేష్ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ…
తెలుగుదేశం గెలుపు ప్రగతికి మలుపుని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఉదయగిరి యూత్ ఆధ్వర్యంలో టీడీపీకి మద్దతుగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ర్యాలీలో కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఉదయగిరి ప్రాంతాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు. మరోవైపు.. తెలుగుదేశం యువత ర్యాలీకి బ్రహ్మ రథం పట్టారు. ఉదయగిరి బస్టాండ్ నుండి తెలుగు దేశం అనుబంధ సంఘాల…
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కాకర్ల సురేష్ ని గెలిపించాలని ఆయన కొడుకు సంహిత్, కూతురు ధాత్రి ఉదయగిరిలోని గొల్లపాలెం, ఎస్సీ, ఎస్టీ పూసల కాలనీలలో తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వీరంతా పసుపు కండువా కప్పుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న ..రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
న్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయగిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలు ఆయనను పూల వర్షాలతో ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జలదంకి మండలం కొత్తపాలెం, సోమవరప్పాడు, కృష్ణపాడు, బోయలపాడు, వేములపాడు, కోదండరామపురం పంచాయతీలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.