కలిగిరి పట్టణంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కలిగిరి ప్రధాన రహదారి వెంబడి ప్రచారం నిర్వహించారు. ప్రతి షాపు దగ్గరకు వెళ్లి తెలుగుదేశాన్ని ఆదరించాలని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ప్రచార రథం పై అభివాదం చేస్తూ ప్రధాన రహదారుల వెంబడి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.. సాగునీరు లేక బంజర భూముల సైతం బీడు భూములుగా మారాయన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ , మరియు సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా నీటిని ఉదయగిరి ప్రాంతానికి తీసుకువచ్చి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
Read Also: Elon Musk PM Modi: ప్రధాని మోదీని కలవనున్న ఎలోన్ మస్క్.. దేశంలో పెట్టుబడుల విషయం పై చర్చ..!
వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదన్నారు. కల్తీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని కాకర్ల సురేష్ తెలిపారు. ఇసుక మైనింగ్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రశ్నిస్తే ఎంతటి వారినైనా హతం చేసే దానికి వైసీపీ నాయకులు బరితెగించారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పట్టాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. బటన్ నొక్కుతున్నాను అని చెప్పి పది రూపాయలు ఇచ్చి ₹100 లాగుతున్నారు ఆయన ఆరోపించారు. వాలంటీర్లకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వస్తే గౌరవ వేతనం 10,000 రూపాయలను ఇస్తామని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారికి ఒక ఇల్లు అయినా కట్టించి ఇచ్చారన్నారు. కాంట్రాక్టర్లకు దోసి పెట్టేందుకే పేదలకు ఇళ్ల పేరట జగన్నాటకం ఆడుతున్నారన్నారు. పునాదిరాళ్లకే అవి పరిమితం అయ్యాయని కాకర్ల సురేష్ చెప్పుకొచ్చారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ అనే నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు.