Kakarla Suresh: ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా మంది వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి. వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా మంగళవారం తూర్పు రొంపి దొడ్ల గ్రామంలో పర్యటిస్తుండగా.. మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో గ్రామ నాయకుల సారథ్యంలో సర్పంచ్‌తో పాటు ఎస్టీ కాలనీకి చెందిన సుమారు ద100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారందరికీ కాకర్ల సురేష్, కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన వారు వీరే..
సర్పంచ్ బి. అంకమ్మ, కాకి అంకయ్య, అల్లూరి శ్రీనివాసులు, మల్లంపాటి ప్రసాద్, మాగంటి సురేష్, నందిపాటి జాషువా, బాల లక్ష్మీ నరసయ్య, సిమ్ము మాల్యాద్రి, కంచుపాటి ఏసుబు, బి సామ్య, కంచుపాటి సునీల్, కాకి లావును, నందిపాటి ప్రభువు ,నందుపాటి రాజు, పేయ్యం మాల్యాద్రి, జంగిటి రవీంద్ర, చెంచులక్ష్మి , ఇళ్ల రవణమ్మ, అల్లూరి వెంకటరమణమ్మ, రావూరి దూతమ్మ, రాగి మాధవి, ఇండ్ల కొండయ్య, రావూరి అంజమ్మ, రావూరి కుమారి, సావిత్రి, రావూరి సుమలమ్మ, తలుపుల సునీత, చిట్టి భాను, ఇళ్ల లక్ష్మమ్మ, చేటూరు మాధవి, రావూరి రూతమ్మ, మేకల మరియమ్మ, కృష్ణమ్మ, శ్రీరామ్ మంగమ్మ, శ్రీరామ్ నారాయణమ్మ శ్రీరామ్ రాజేష్, శ్రీరామ్ దిలీప్, పావులూరి పాపయ్య, ఎల్ల రంగయ్య, రామయ్య, అల్లూరి నరసింహ, రావూరి అంకయ్య, అల్లూరి ప్రమీలమ్మ, అల్లూరి కొండయ్య, అల్లూరు బ్రహ్మయ్య ,తలపుల మాలకొండయ్య, అల్లూరి రాజేష్, తలపల శ్రీనివాసులు, తదితరులు టీడీపీలో చేరారు.
కొండాపురం మండలంలో వైసీపీకి భారీ షాక్..!
కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మామిళ్ళపల్లి ఓంకారం, క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు, స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో సుమారు 200 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ వారికి కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ గ్రామం మొత్తం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తాను పాటుపడతానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వస్తే సూపర్ సిక్స్ పథకాలు అందుతాయన్నారు. కాకర్ల ట్రస్ట్ ద్వారా 16 సంక్షేమ పథకాలను అమలు చేశానని, అధికారం ఉంటే మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, కాకర్ల సునీల్, తలప నేని లక్ష్మీనారాయణ, బొట్లగుంట హరిబాబు పోలినేని చంద్రబాబు, కుంకుమ మోహన్ రావు, పోలినేని రమేష్, పామూరు తిరుపతిరెడ్డి, పదార్ల తిమోతి, బద్దిపూడి మాచర్ల, లింగాల లక్ష్మారెడ్డి, గద్దె రామకృష్ణ, జనసేన అధ్యక్షులు ఆకుల వెంకట, బీజేపీ అధ్యక్షులు మల్లికార్జున, సిహెచ్ అబ్బాయి నాయుడు, చెంచు నాయుడు, నర్రా నారాయణ, ఎడ్ల నరసింహారావు, యూనిట్ ఇంచార్జ్ బొడ్డేపల్లి రామయ్య, సుబ్బారావు, రంగారావు, వెంకటేశ్వర్లు, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
పల్లె జనం ఆత్మీయత అనురాగాల మధ్య పల్లె పల్లెకు కాకర్ల..!
ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎక్కడికి వెళ్ళినా పల్లె జనం ఆత్మీయత, అనురాగాలను చూపిస్తూ, ఘన స్వాగతం పలుకుతూ నీరాజనాలు అందిస్తున్నారు. ఎంతో కోలాహలంగా జరుగుతున్న ప్రచారంలో ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా కాకర్ల సురేష్ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరికుంటపాడు మండలం గణేష్ పురం, నరసింహపురం, తూర్పు రొంపి దొడ్ల, డక్కునూరు, కొండారెడ్డిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, వేంపాడు పంచాయతీలలో, ఎస్సీ ఎస్టీ కాలనీలలో కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లె జనం నీరాజనాలు పలికారు. ఆత్మీయత అనురాగాలను చూపించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తామని, ఘంటా పదంగా తెలిపారు. వైసీపీ నుండి భారీగా టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎంతో కోలాహలంగా పండగ వాతావరణంలో జరుగుతున్న పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్‌తో పాటు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కాకర్ల మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగం రావాలంటే బాబు రావాలన్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు. విశాలమైన భూభాగం ఉన్న మెట్ట ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీఇచ్చారు. తాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన సురేష్ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ముఖ్యంగా మౌలిక వసతులు రోడ్లు భవనాలు విద్యుత్ భూసమస్యలు మిగిలిన భూమిల పంపకం తదితర సమస్యలను తెలుగుదేశం అధికారంలోనికి రాగానే పరిష్కరిస్తానని తెలిపారు. మహిళలకు రక్షణగా నిలుస్తానన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానన్నారు. అదేవిధంగా 1983 నుండి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తానని వారికోసం ఎన్నికల అనంతరం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడతానన్నారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తల జోలికి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. కనుక ప్రతి ఒక్కరు అండగా నిలిచి తెలుగుదేశాన్ని ఆదరించాలని తెలిపారు.ప్రతి గ్రామంలో ఆ గ్రామ నాయకులు ఆధ్వర్యంలో గజమాలతో, శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రమాదంలో మృతి చెందడం పట్ల కాకర్ల సురేష్ దిగ్బాంతి..,!
జలదంకి మండలం చామాదల దళిత వాడకు చెందిన తెలుగుదేశం నాయకులు దావులూరి శ్రీనివాసులు, లక్ష్మమ్మ దంపతులు, వారి కోడలు, మనవడితో పాటు ఐదు మంది కావలి సమీపంలోని ముంగమూరు తోటల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జలదంకి మండల నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగింది అని తెలుసుకున్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని నాయకులకు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు.