కడప జిల్లా లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎకరాకు 14 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తోందని, ఒక ఎకరా అరటి సాగుకు రైతుకు లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు ఖర్చవుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.14,000 నేలకొరిగిన అరటి చెట్లు తొలగించడానికి అయ్యే కూలీలకు కూడా సరిపోదన్నారు. అరటి రైతులను ప్రభుత్వం అని విధాలుగా ఆదుకోవాలని అవినాష్ రెడ్డి కోరారు.
‘ప్రభుత్వం వెంటనే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు బీమా ఇవ్వాలి. అకాల వర్షాలకు 750 ఎకరాలలో అరటి పంటకు తీవ్ర నష్టం జరిగింది. గత మూడు వారాలలో 2150 ఎకరాలలో అరటి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఎకరాకు రూ.14 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తోంది. ఒక ఎకరా అరటి సాగుకు రైతుకు లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.14000 నేలకొరిగిన అరటి చెట్లు తొలగించడానికి అయ్యే కూలీలకు కూడా సరిపోదు. పంట నష్టం అంచనా లోపు భూయిష్టంగా ఉంది’ అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.