కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించాడని కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంపై కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధిగా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!
మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో నీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ మార్చి 28న కడప మేయర్ సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయితే మేయర్ ఆ నోటీస్ పై హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు గడువు పెంచిన కోర్ట్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు మేయర్ సురేష్ బాబు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట సాయంత్రం మూడు గంటలకు హాజరుకానున్నారు. సురేష్ బాబు సంజాయిషీపై ప్రభుత్వం సంతృప్తి చెందకపోతే.. ఆయనపై అనర్హత వేసే అవకాశం ఉంది.