TDP Mahanadu 2025: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో మహానాడు నిర్వహణకు పనులు మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పదికి ఏడు స్థానాల్లో గెలిచి వైసీపీకి షాక్ ఇచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ మహానాడు నిర్వహించి తన బల నిరూపణకు సిద్ద మవుతోంది టీడీపీ.. రాయలసీమపై టీడీపీ గురిపెట్టిందా ? అక్కడే మహానాడు నిర్వహణకు టీడీపీ పన్నుతున్న వ్యూహం ఏమిటి ? అనేది ఇప్పుడు చర్చగా మారింది.. సాదారణంగా కడప జిల్లా ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం.. నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరకు ఆ కుటుంబందే అక్కడ హవా… ఏ ఎన్నికలు వచ్చినా అక్కడ వారిదే పై చేయి. వారు చెప్పిన వారే అభ్యర్థులు.. గత 25 సంవత్సరాలుగా కడప జిల్లాలో టీడీపీకి నామమాత్రపు సీట్లు దక్కుతున్నాయట. 2004లో పది స్థానాలకు గాను ఒక్క స్థానం మాత్రమే టీడీపీకి దక్కిందట. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే ఇస్తాన్నాన్ని దక్కించుకుంది.
Read Also: Techie Suicide: పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. స్పందించిన ఓలా!
2019 లో 10కి 10 వైసీపీ దక్కించుకుని క్లిన్ స్వీప్ చేసింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాలకు గాను ఏడు స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.. టీడీపీ ఐదు, బీజేపీ ఒకటి, జనసేన ఒకటి చొప్పున ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది కూటమి.. మొట్టమొదటిసారిగా జిల్లాలో బీజేపీ, జనసేన పార్టీలు బోణి కొట్టాయి.. ఇదే ఇప్పుడు టీడీపీ జోష్ కు ప్రధాన కారణమైందట. వైసీపీ అధినేత జగన్ అడ్డాలో ఏడు ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకొని తన సత్తా ఏంటో చాటిందట కూటమి. అంతేకాకుండా వైసీపీ అధినేత అడ్డాలో మరో బల ప్రదర్శనకు సిద్ధమవుతోందట. టీడీపీ పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కడప జిల్లాలో మహానాడు నిర్వహించడమే కాకుండా జగన్ అడ్డాలో టీడీపీ బలమెంటో నిరూపించుకోవాలని చూస్తోందట.. అందుకోసం ఈనెల 27, 28, 29 తేదీలలో నిర్వహించనున్న మహానాడు పనులు మొదలుపెట్టారట…
Read Also: Bengaluru: బెంగళూరును ముంచెత్తిన కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బైకులు
కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న మహానాడు ను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించాలని టీడీపీ భావిస్తోందట.. ఈనెల 27న జరగనున్న మహానాడు ను కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం గ్రామం జైరాజ్ గార్డెన్ సమీపంలో నిర్వహించడానికి అధిష్టానం నిర్ణయించింది… అటు రైల్వే ఇటు విమాన మార్గాలకు అనుకూలమైన ప్రదేశాన్ని టీడీపీ ఎంపిక చేసింది… దాదాపు 145 ఎకరాల్లో మహానాడు నిర్వహించనున్నారు… మహానాడు నిర్వహణ కోసం 13 కమిటీలను వేసింది టీడీపీ.. మహానాడు నిర్వహణపై ఈ కమిటీలతో దాదాపు ఏడు మంది మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది… హోం మంత్రి అనిత స్వయంగా పార్కింగ్ స్థలాలను పరిశీలించి పోలీసులకు తగు సూచనలు జారీ చేసింది.. ఈ వారం రోజుల్లో వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు… జన సమీకరణ, ఆహారం, తాగునీరు, మౌలిక వసతులు పై మంత్రుల బృందం దృష్టిసారించింది.. ఒక్కొక్క కమిటీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు… మంత్రుల సమీక్ష సమావేశం అనంతరం రాత్రింబగళ్లు మహానాడు ఏర్పాట్లు మొదలయ్యాయి… అయితే మంత్రుల సమావేశం ముగిసిన వెంటనే మహానాడు ఏర్పాట్లకు వర్షం ఆటంకంగా మారింది.