దింగత నేత వైఎఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు వైఎస్‌ఆర్ అభిమానులు క్యూ కడుతున్నారు. నివాళులు అర్పించేందుకు సీఎం వైఎస్ జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం సొంత నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.. ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్‌కు.. పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. కడప విమానాశ్రయం వద్ద, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఆయనకు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు నిందితులు, అనుమానితులను విచారిస్తోంది సీబీఐ టీమ్.. మరికొందరిని అదుపులోకి కూడా తీసుకుంది.. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ బృందం మరోసారి విచారణకు పిలిచింది. మరోవైపు వివేకా కుమార్తె సునీత మధ్యమధ్యలో సీబీఐ అధికారులను కలుస్తూ కేసు దర్యాప్తు…
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిందితుల ఇళ్లలోనే వివేకా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ పలువురు స్థానిక నేతలను ప్రశ్నించారు.. మరోవైపు.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వైస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత సునీత లేఖపై స్పందించారు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సునీత కుటుంబ రక్షణ కోసం చర్యలను చేపట్టామని…
తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత పురోగతి సాధించారు సీబీఐ అధికారులు… వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. రహస్యంగా ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగింది.. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన సీబీఐ.. చివరకు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం.. జిల్లాలోని 20 మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచింది సీబీఐ… వివేకా హత్య కేసు అనుమానితులు మరోసారి హాజరయ్యారు.. ఇవాళ మరోమారు విచారణకు హాజరయ్యారు ఉదయ్ కుమార్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, ప్రకాష్ రెడ్డి, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్.. పలుమార్లు వివిధ కోణాల్లో వీరిని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. మరోవైపు.. సీబీఐ అధికారులను కలిశారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్.. ఇవాళ పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వెళ్లిన ఇద్దరూ..…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాయలసీమలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం పర్యటన ఉంటుంది. జూలై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆర్బీకే ప్రారంభించటంతో పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు.…
కడప జిల్లా : బ్రహ్మంగారి మఠం వివాదం రోజు రోజుకు ముదురుతోంది. బ్రహ్మంగారి మఠంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీకాంత్ పై నిన్న కొందరు దాడికి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాడికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ దాడికి ప్రయత్నించిన ఘటనలో ఐదు మందిపై కేసు నమోదు అయింది. బంకు శీను, దీప్తి రమణారెడ్డి బాబ్జి, శ్రీ రాములు నారాయణ రెడ్డి అనే వ్యక్తులపై 452,…
కడప జిల్లా పులివెందుల మండలంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన పార్థసారథి రెడ్డిపై పులివెందుల ఎంపీపీ శివప్రసాద్ రెడ్డి కాల్పులు జరిపారు. కాల్పుల్లో పార్థసారథిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పార్థసారథి రెడ్డి మరణించాడనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఎంపీపీ శివ ప్రసాద్ మరణించారు.అయితే ఈ ఘటనకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని.. వాళ్ళు ఇద్దరు బంధువులే అని స్థానికులు అంటున్నారు. కాగా విషయం తెలిసిన…
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పరిస్థితులు టెన్షన్ టెన్షన్ గా ఉంది.కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు పోలీసులు. బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అక్కడ చర్చలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆలయ పరిసర ప్రాంతాల్లో గ్రామస్థులకు కూడా ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరిక జారీ చేసారు. కానీ పీఠాధిపతుల రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మమ్మ. ఇప్పటికే పీఠాధిపతుల బృందంపై డీజీపీకి ఫిర్యాదు చేసారు మహాలక్ష్మమ్మ. అయితే పెద్ద కుమారుడు వెంకటాద్రికి…