వైఎస్సార్ వర్ధంతి.. ఇడుపులపాయకు ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దింగత నేత వైఎఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఇడుపులపాయకు వైఎస్‌ఆర్ అభిమానులు క్యూ కడుతున్నారు. నివాళులు అర్పించేందుకు సీఎం వైఎస్ జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం సొంత నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.. ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్‌కు.. పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. కడప విమానాశ్రయం వద్ద, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
తర్వాత హెలికాప్టర్‌లో ఇడుపుల పాయ చేరుకున్నారు సీఎం జగన్. సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌లో … జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి ఉన్నందున.. దీనికి సంబంధించి పార్టీ నేతలతో సమీక్ష చేశారు. రాత్రి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఇవాళ ఉదయం ఇడుపుల పాయలోని దివంగత సీఎం, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌ను సందర్శించనున్నారు సీఎం జగన్. తండ్రికి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తల్లి విజయమ్మ, భార్య వైఎస్ భారతి, బాబాయ్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో కలిసి తండ్రి సమాధికి నివాళి అర్పిస్తారు. తర్వాత పార్టీ నాయకులతో సమావేశమవుతారు.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Also Read
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?