కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నికను అక్టోబర్ 30 వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కాగా, రేపు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 30 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి…
బద్వేల్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. పార్టీ అభ్యర్తి డాక్టర్ సుధ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని తెలిపిన ఆయన.. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఆదేశించారు.. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య…
కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గంవైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సుధను ప్రకటించింది. ఇక, బద్వేల్ ఉప ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. రేపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలవనున్నారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ, అభ్యర్థి సుధతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం…
వైసీపీ పార్టీలో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ. రమణారెడ్డి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. అటు రమణా రెడ్డి మృతి పట్ల తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రగాఢ…
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అయితే, మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేసింది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా. ఈ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.. వైఎస్ వివేకా కేసులో ఇవాళ ఉదయం నుంచి ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు… దీంతో ఉమాశంకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు.…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. పార్టీకి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. జమ్మలమడుగు నియోజక వర్గం టీడీపి ఇన్‌చార్జీగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని నియమించాలని ఈ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. అదే విధంగా బద్వేల్ ఉప ఎన్నికపై కూడా భేటీలో చర్చించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ను…
ఒకప్పుడు ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అక్కడ అదేపార్టీ దిక్కులేకుండా పోయింది. మారిన రాజకీయ పరిణామాలు.. నేతల అవసరాలు మళ్లీ ఆ పార్టీకి గిరాకీ తెచ్చాయి. ఇప్పటికే ఓ నేత పాతగూటికి చేరేందుకు దారులు వెతుకుతుంటే.. మరో కొత్త నేత తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీని భుజానికి ఎత్తుకొనేందుకు రెడీ అవుతున్నారట. దేవగుడి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తోందా? కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాయకుడే లేకుండా దిక్కులేనిదైన…
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురం లో నాగయ్య – నాగమ్మ అనే దంపతులను దారుణంగా హత్య చేశారు. తెల్లవారు జామున వారు ఇంట్లో నిద్రి స్తుండగా హత్యకు పాల్పడ్డాడు హంతకుడు వీరయ్య. అయితే…ఈ ఘటన లో మృతి చెందిన వారికి నిందితుడు వీరయ్య కొడుకు వరుస అవుతాడని తెలుస్తోంది. మానసిక పరిస్థితి సరిగా లేక పెద్దమ్మ నాగమ్మ, పెద్దనాన్న నాగయ్య లను హత్య చేసినట్లు స్థానికులు…
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకున్న ఆయన.. వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించారు.. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు… ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, వారి కుటుంబసభ్యులు, పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.. ఇక, వైఎస్ రాజశేఖర్…